English   

మహేష్ బాబు ఛాయిస్ అదిరింది..

mahesh babu

ది బెస్ట్ టెక్నీషియన్స్ తో పనిచేయడం సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్. అందునా.. సినిమాటోగ్రాఫర్స్ విషయంలో మహేష్ సెలెక్షన్ భలే ఉంటుంది. నిజానికి  టెక్నికల్ రిచ్ నెస్ అనేది ఓ సినిమాకు ఎంతో కీలకం. కథ, కథనాలు ఎంత బలంగా ఉన్నా.. వాటిని ఎలివేట్ చేసే టెక్నికల్ సపోర్ట్ లేకపోతే కష్టం. కొన్నాళ్ల క్రితం ఏమో కానీ.. ఈ మధ్య కాస్త ఖర్చు అయినా మనోళ్లు ది బెస్ట్ టెక్నీషియన్స్ నే అడాప్ట్ చేసుకుంటున్నారు. వీరిలో కథలు నచ్చితేనే సినిమాలు చేస్తాం అనే బ్యాచ్ కూడా ఉంటుంది. అలాంటి వారు ఓ సినిమాకు పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా ది బెస్ట్ అవుట్ పుట్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అలాంటి ఓ టాప్ టెక్నీషియనే మహేష్ బాబు కోసం టాలీవుడ్ కు రాబోతున్నాడు.

గతేడాది వచ్చిన స్పైడర్ సినిమా కోసం సంతోష్ శివన్ తో పనిచేసి చిన్నపిల్లాడిలా ఆనందపడ్డాడు మహేష్ బాబు. కొరటాల శివతో చేస్తోన్న సినిమాకూ బాలీవుడ్ నుంచే తీసుకువచ్చాడు. దిల్ చాహ్ తా హై ఫేమ్ రవి కె చంద్రన్ ను తీసుకున్నా.. దర్శకుడితో విభేదాలు వచ్చి రవి వెళ్లిపోయాడు. అయితే తన 25వ సినిమాకు మరో టాప్ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ను తీసుకువస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మాతలు. కేరళ రాష్ట్రానికి చెందిన కె.యు. మోహనన్ ఈ సారి మహేష్ బాబు 25వ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నాడు. అతను కేరళ వాడే అయినా ఎప్పుడో బాలీవుడ్ కు వెళ్లిపోయాడు. ఇండియాలోని ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో మోహనన్ ఒకరు. ఎక్కువగా షారుఖ్ సినిమాలకు పనిచేస్తుంటాడితను. షారుఖ్ చేసిన డాన్, రాయీస్, జబ్ హేరీ మెట్ సీజల్ వంటి సినిమాలకు ఇతనే కెమెరామేన్. ఆశ్చర్యం ఏంటంటే.. ఈ సినిమాకు ముందుగా పిఎస్ వినోద్ ను కెమెరామెన్ గా తీసుకున్నారు. యూఎస్ లో లొకేషన్స్ చూడ్డానికి కూడా అతనే వెళ్లాడు. కానీ మోహనన్ కావాలనేది మహేష్ బాబు చాయిస్. దీంతో అనివార్యంగా వినోద్ ను తప్పించాల్సి వచ్చింది. ఏదేమైనా వినోద్ కూడా బెస్ద్ సినిమాటోగ్రాఫరే. అయినా మోహనన్ విషయలో మహేష్ బాబు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటనేది సినిమా చూస్తే కానీ చెప్పలేం.. ఎనీ హౌ మహేష్ చాయిస్ అదిరిందనే చెప్పాలి. 

More Related Stories