English   

మహేష్ ను చూసి నమ్మలేరు... కానీ నమ్మాలి

Mahesh Babu 25th Movie Maharshi First Look Released on his Birthday
2018-08-09 00:32:45

ఇప్పుడు నిజంగానే ప్రేక్ష‌కుల‌ను ఒప్పించ‌డానికి తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. చూడ్డానికి పాతికేళ్ల కుర్రాడిలా క‌నిపించే మహేష్ ను ప‌ట్టుకుని అప్పుడే 44 ఏళ్ళ వ‌య‌సుకి వ‌చ్చేసాడంటే న‌మ్మ‌డం ఎలా చెప్పండి..? ఇప్ప‌టికీ పాల‌బుగ్గ‌ల ప‌సివాడిలా క‌నిపిస్తుంటాడు ఈ హీరో. ఈ మ‌ధ్యే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కుర్ర హీరోలు కూడా మహేష్ అంత ఛార్మింగ్ గా క‌నిపించ‌రు. ఇప్ప‌టికీ అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగానే ఉంటాడు ఈ రాజ‌కుమారుడు. కుర్ర హీరోల‌కు కూడా అర్థం కాని అందంతో కుళ్లు తెప్పిస్తుంటాడు. ఈయ‌న ఇమేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. ఈ హీరో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఈ మ‌ధ్యే 19 ఏళ్లు గడిచిపోయింది. ఇక ఇప్పుడు 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు మహేష్ బాబు. బాల‌న‌టుడిగా వ‌చ్చి.. రాజ‌కుమారుడుతో హీరోగా మారి.. పోకిరితో సూప‌ర్ స్టార్ అయ్యాడు మహేష్. ఈ పుట్టిన‌రోజు బ‌హుమ‌తిగా వంశీ పైడిప‌ల్లి రిషి సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు. ఆగ‌స్ట్ 9 రాత్రి 12.06 నిమిషాల‌కి ఈ లుక్ వ‌చ్చింది. ఇక ఆగ‌స్ట్ 9 ఉద‌యం 9.09 నిమిషాల‌కు టీజ‌ర్ విడుద‌ల కానుంది.

అది 1999.. జులై 30.. ఆ రోజే మహేష్ రాజ‌కుమారుడు విడుద‌లైంది. కృష్ణ న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి దూసుకొచ్చాడు మహేష్. అశ్వినీద‌త్ నిర్మాత‌గా రాఘ‌వేంద్ర‌రావ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది ఈ చిత్రం. అప్ప‌ట్లో ఈ చిత్రం ఓ సంచ‌ల‌నం. రాజ‌కుమారుడుతోనే ప్రిన్స్ ముద్ర కూడా వేయించుకున్నాడు. ఆ త‌ర్వాత యువ‌రాజు.. మురారి.. ఒక్క‌డు.. అత‌డు.. పోకిరి.. దూకుడు.. సీత‌మ్మ వాకిట్లో.. బిజినెస్ మ్యాన్.. శ్రీ‌మంతుడు.. భ‌ర‌త్ అనే నేను లాంటి సినిమాల‌తో మహేష్ ప్రిన్స్ నుంచి సూప‌ర్ స్టార్ అయ్యాడు. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి రిషి సినిమాతో బిజీగా ఉన్నాడు సూప‌ర్ స్టార్. మొత్తానికి 44 ఏళ్ల జీవిత ప్ర‌యాణంలో ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోకుండా మిస్ట‌ర్ క్లీన్ అనిపించుకున్నాడు మహేష్ బాబు. ఇక‌ 19 ఏళ్ల న‌ట జీవితంలో 8 నందులు.. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు మహేష్. సూప‌ర్ స్టార్ ఇలాంటి పుట్టిన‌రోజులు మ‌రిన్ని జ‌రుపుకోవాల‌ని ఆశిస్తూ సినిమా పాలిటిక్స్. కామ్ త‌ర‌ఫు నుంచి కూడా హ్యాపీ బ‌ర్త్ డే టూ మహేష్.

More Related Stories