English   

ఎట్టకేలకి ఇండియా వచ్చేశారు ?

Mahesh
2019-06-17 11:15:27

ఎప్పుడో మ‌హ‌ర్షి సినిమా విడుద‌లైన తర్వాత ప్రమోషన్స్ పూర్తి చేసుకుని ఫారెన్ టూర్ వెళ్లాడు మ‌హేష్ బాబు. నిజానికి ఆయనకీ ఏ చిన్న గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లడం అలవాటు. సెలవులు దొరికితే ఫ్యామిలితో స‌రాదాగా టూర్స్ కి వెళ్ళే సెలెబ్రిటీల లిస్ట్‌లో మ‌హేష్ మొదటి వరసలో ఉంటారని చెప్పొచ్చు. ఎక్కువ‌గా చల్లటి ప్రదేశాలు ఇష్ట‌ప‌డే మ‌హేష్ హాలీడే వెకేష‌న్స్ కోసం ఎక్కువ‌గా అక్క‌డికే వెళుతుంటాడు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి లండ‌న్ లో వేసవి తాపం నుంచి సేద తీరుతున్నారు. ప్రొఫెషనల్‌ లైఫ్‌ని, పర్సనల్‌ లైఫ్‌ని బ్యాలెన్స్‌ చేస్తు కుటుంబంతో సమయాన్ని గడుపుతుంటారు. ఆ మ‌ధ్య ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా చూసిన ఈయ‌న‌ ఆ త‌ర్వాత వెంట‌నే ఇండియాకు వ‌స్తాడని అనుకున్నారు. కానీ ఆయన వంశీ పైడిప‌ల్లిని కూడా త‌న‌తో పాటే వెంట పెట్టుకుని వెకేషన్ లోనే ఉన్నారు. అలా మొత్తం ఎంజాయ్ చేసిన ఆయన నిన్ననే శంషాబాద్ లో ల్యాండ్ అయ్యారట. వచ్చేనెల మొదటి వారం నుండి అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌బోయే స‌రిలేరు నీకెవ్వ‌రు రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఆ సినిమా సెట్స్ కి మ‌హేష్ బాబు జాయిన్ కానున్నారు. వ‌చ్చీ రాగానే సినిమాలో బిజీ అవ్వలేమో అనుకున్నారో ఏమో ఒక పదిహేను రోజులు ముందే వచ్చి రెస్ట్ తీసుకోనున్నాడు మహేష్. సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా ఉండ‌టంతో త్వరత్వరగానే సినిమా పూర్తి చేయనున్నారు మ‌హేష్ బాబు.

More Related Stories