English   

మహేష్ బాబుకు స్పాట్ ఫిక్స్ అయింది.. 

Bharat-Ane-Nenu

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అనేనేకు స్పాట్ అండ్ డేట్ ఫిక్స్ అయింది. కైరా అద్వానీ హీరోయిన్. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కినఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఓత్, టీజర్ తో పాటు భరత్ విజన్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 20న విడుదల కాబోతోన్న భరత్ అనే నేనుపై భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల శివ దర్శకుడు కావడం, ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ అయి ఉండటమే అందుకు కారణం. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించిన డేట్ అండ్ స్పాట్ ఫిక్స్ అయిపోయాయి. 

ఏప్రిల్ 7న శనివారం రోజున హైదరబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. నిజానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఇంత పెద్ద స్టేడియం అక్కర్లేదు. కానీ ఆ ఫంక్షన్ కోసం కూడా ఏకంగా అక్కడ అసెంబ్లీ సెట్ వేయిస్తున్నాడట కొరటాల. అందుకే ముందు నోవాటెల్ కానీ శిల్ప కళా వేదిక కానీ అనుకున్నా.. ఈ సెటప్ కోసం వెన్యూ మారింది. అదైతే రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు వచ్చినా ఇబ్బంది ఉండదు. ఇన్ అవుట్ సమస్యలు కూడా తగ్గుతాయి. మామూలుగా అయితే ఎల్బీ స్టేడియంలో ఎక్కువగా పొలిటికల్ మీటింగ్స్ జరుగుతుంటాయి. అయితే ఇది కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కాబట్టి కవర్ అవుతుందనుకోవచ్చు. ఏదేమైనా అసలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముందు వైజాగ్ లో పెట్టాలనుకున్నారు. కానీ రంగస్థలంకు వచ్చిన ప్రోటెస్ట్ చూసి విజయవాడ వెళ్దామనుకున్నారు. కానీ అక్కడి రియల్ పొలిటికల్ హీట్ బాగా ఉంది. ఈ టైమ్ లో రిస్క్ ఎందుకు అనుకునే ఫైనల్ గా హైదరాబాద్ లో ఫిక్స్ అయ్యారు. 

More Related Stories