English   

మహేష్ బాబుకు ఇది చాలా పెద్ద సవాల్.. 

Mahesh-babu

మహేష్ బాబుకు టార్గెట్ ఫిక్స్ అయింది. ఇన్నాళ్లూ టాలీవుడ్ నెంబర్ గేమ్ లో టాప్ లో ఉన్న మహేష్ కు ఆ నెంబర్ నిజమే అనిపించుకునే టైమ్ కూడా ఫిక్స్ అయిపోయింది. అదేంటీ అనుకుంటున్నారా..? అంతేకాదు సూపర్ స్టార్ కు తన స్టామినా ప్రూవ్ చేసుకునే చాన్స్ వచ్చింది. అది భరత్ అనేనేనుతో. మరి భరత్ కు టార్గెట్ ఫిక్స్ చేసింది ఎవరో తెలుసా.. రామ్ చరణ్. యస్.. రామ్ చరణ్ రంగస్థలం మహేష్ సత్తా చూపే టార్గెట్ ఫిక్స్ చేసింది. మరి భరత్ ఆ టార్గెట్ ను ఛేదిస్తాడా లేదా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలంలో ట్రెమండస్ హిట్ కొట్టాడు. యూనానిమస్ హిట్ టాక్ తో ఈ మూవీ ఏకంగా వందకోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అది కూడా కేవలం రెండు వారాల్లోనే. ఇప్పటి వరకూ నాన్ బాహుబలి రికార్డ్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ల రికార్డ్ ను కూడా ఛేదించింది రంగస్థలం. ఈ రోజుతో రంగస్థలం కలెక్షన్స్ మొత్తం 106కోట్ల షేర్. ఇది నాన్ బాహుబలి ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్. సో.. రంగస్థలం హవా మరి కొన్ని రోజులు ఉన్నా.. కలెక్షన్లు అంతే స్పీడ్ గా ఉంటాయనుకోలేం. మొత్తంగా ఇది 110కోట్ల వద్ద ఎండ్ అవుతుందని ట్రేడ్ అంచనా. అదే ఇప్పుడు భరత్ అనేనేను టార్గెట్ గా చెప్పొచ్చు. 

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న భరత్ అనేనేను ఈ నెల 20న విడుదల కాబోతోంది. కైరా అద్వానీ హీరోయిన్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పొలిటికల్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే పొలిటికల్ సబ్జెక్ట్ అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న. అయితే మహేష్ బాబు సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు. కానీ ఆ టాక్ రావాలి. వచ్చినా ఈ మూవీని బ్లాక్ బస్టర్ అని చెప్పలేమేమో అంటోంది ట్రేడ్. ఎందుకంటే భరత్ అనేనేను థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా 99కోట్లకు అమ్మేశారు. బిగ్గెస్ట్ హిట్ అనే టాక్ వస్తే తప్ప ఆ ఫిగర్ ను రీచ్ కావడం అంత సులభం కాదు. ఒకవేళ వందకోట్ల సినిమా అయినా కొన్నవాళ్లంతా హ్యాపీగా ఉంటారని చెప్పలేం. అంటే వంద కోట్లు కాదు.. ఇప్పుడు మహేష్ నాన్ బాహుబలి రికార్డ్ కొట్టేయాలి. అప్పుడే భరత్ అనేనేను కొన్నవారికి ఆనందం. 
 
మరోవైపు తెలుగులో వచ్చిన పొలిటికల్ డ్రామాలేవీ పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ఆ సెంటిమెంట్ ను కూడా భరత్ బ్రేక్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు ఉన్న బిగ్గెస్ట్ అస్సెట్ మహేష్ అండ్ కొరటాల. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు బిగ్గెస్ట్ హిట్. ఇద్దరికీ ఓవర్శీస్ లో మంచి మార్కెట్ ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి పెద్ద రెవిన్యూ వచ్చే అవకాశాలున్నాయి. ఏదేమైనా ఇప్పుడు రామ్ చరణ్ విసిరిన టార్గెట్ ను ఛేదించడం మహేష్ బాబుకు పెద్ద సవాలే.. 

More Related Stories