English   

మహేష్ బాబు కోసం భారీ ప్లాన్

mahesh babu

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న సెకండ్ మూవీ భరత్ అనే నేను. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి(ముఖ్యంగా మహేష్ కు). ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కావడం ఒకటైతే.. ఇప్పటి వరకూ అపజయం లేకుండా దూసుకుపోతోన్న దర్శకుడు కొరటాల శివ మరో కారణం. ఇక మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడనే వార్త మరింత హైప్ పెంచుతోంది. మొత్తంగా ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి భరత్ టీమ్ భారీ ప్లాన్స్ వేస్తోంది. ముఖ్యంగా ఈ టీమ్ ఓవర్శీస్ పై ఎక్కువ కాన్ సెంట్రేట్ చేస్తోంది. ఏప్రిల్ 20న విడుదలకు సిద్ధంగా ఈ మూవీ ప్రీమియర్స్ కోసం ఇప్పటి నుంచే భారీ ప్రణాళికలు వేస్తున్నారు.

టాలీవుడ్ నుంచి ఓవర్శీస్ లో మహేష్ ను మించిన స్టార్ లేడు. అతని ఫ్లాప్ సినిమాలు బ్రహ్మోత్సవం, స్పైడర్ కూడా ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తాయి. అలాగే ఈ రెండు సినిమాలు మహేష్ మేనియాను కొంత తగ్గించాయని కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు కొరటాలతో సినిమా కావడంతో మళ్లీ కాంబినేషన్ క్రేజ్ పెరిగింది. పైగా శ్రీమంతుడుతో యూఎస్ లో 2.9 మిలియన్స్ కలెక్ట్ చేశాడు కొరటాల శివ. అలాగే రీసెంట్ మూవీ జనతాగ్యారేజ్ తోనూ ఎన్టీఆర్ కెరీర్ లోనే హయ్యొస్ట్ గా 1.8మిలియన్ కలెక్ట్ చేశాడు. ఈ సారి  ఫిగర్స్ ను డబుల్ చేయాలనే ఆలోచనతో ఉంది భరత్ మూవీ టీమ్. అందుకే ఇప్పటి నుంచే అక్కడ ప్రదర్శించబోయే ప్రీమియర్ థియేటర్స్ పై దృష్టిపెట్టాయి. ఈ మధ్య కాలంలో ఓవర్శీస్ లో ప్రీమియర్స్ తో పాటు వీకెండ్ కలెక్షన్లు కీలకంగా మారాయి. అందుకే ఈ విషయంలో ఎక్కువ కాన్ సెంట్రేట్ చేస్తున్నారు. రికార్డ్ స్థాయిలో ప్రీమియర్స్ వేయాలని.. అందుకోసం ఇప్పటి నుంచే మూవీపై మరిన్ని అంచనాలు పెంచే ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. అలాగే సినిమా విడుదలకు ముందు మహేష్ బాబుతో యూఎస్ లో కీలక ప్రాంతాల్లో ప్రమోషన్స్ కూడా చేయించాలనుకుంటున్నారు. ఏదేమైనా రెండు ఫ్లాపులు ఇచ్చిన బాధను ఈ సినిమాతో ఓవర్ కమ్ కావాలనుకుంటున్నాడు మహేష్ బాబు. అందుకోసం భారీ ప్రయత్నాలే చేస్తున్నట్టు టాక్..

More Related Stories