English   

19 వసంతాల రాజకుమారుడు.. 

Mahesh-Babu
2018-07-30 12:23:54

చూడ్డానికి పాతికేళ్ల కుర్రాడిలా క‌నిపిస్తాడు. కానీ ప‌దేళ్ల కుమారుడికి తండ్రి ఆయ‌న‌. 44 ఏళ్ల వ‌య‌సులో కూడా ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కు కూడా అర్థం కాని అందంతో కుళ్లు తెప్పిస్తుంటాడు. అత‌డే మ‌హేశ్ బాబు. ఈయ‌న ఇమేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. ఈ హీరో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 19 ఏళ్లు గడిచిపోయింది. అది 1999.. జులై 30.. ఆ రోజే మ‌హేశ్ రాజ‌కుమారుడు విడుద‌లైంది. కృష్ణ న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి దూసుకొచ్చాడు మ‌హేశ్. అశ్వినీద‌త్ నిర్మాత‌గా రాఘ‌వేంద్ర‌రావ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది ఈ చిత్రం. అప్ప‌ట్లో ఈ చిత్రం ఓ సంచ‌ల‌నం. రాజ‌కుమారుడుతోనే ప్రిన్స్ అనే ముద్ర కూడా వేయించుకున్నాడు. ఆ త‌ర్వాత యువ‌రాజు.. మురారి.. ఒక్క‌డు.. అత‌డు.. పోకిరి.. దూకుడు.. సీత‌మ్మ వాకిట్లో.. బిజినెస్ మ్యాన్.. శ్రీ‌మంతుడు.. భరత్ అనే నేను లాంటి సినిమాల‌తో మ‌హేశ్ ప్రిన్స్ నుంచి సూప‌ర్ స్టార్ అయ్యాడు. ప్ర‌స్తుతం వంశీ పైడిపల్లి సినిమాతో బిజీగా ఉన్నాడు సూప‌ర్ స్టార్. దాంతోపాటు సుకుమార్ తోనూ ఓ సినిమాకు కమిటయ్యాడు. మొత్తానికి 19 ఏళ్ల జ‌ర్నీలో ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోకుండా మిస్ట‌ర్ క్లీన్ అనిపించుకున్నాడు మ‌హేశ్ బాబు. ఈ ప్ర‌యాణంలో 7 నందులు.. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు మ‌హేశ్. సూపర్ స్టార్ ప్రయాణం ఇలాగే కొనసాగాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. 

More Related Stories