English   

సినిమా కార్మికులకు మహేష్ బాబు 25 లక్షలు.. 

Mahesh Babu
2020-03-28 16:47:51

తెలుగు ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా కదిలొస్తున్నారు. నిన్నటి వరకు అంతా ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఇచ్చారు. ఇప్పుడు సినిమా కార్మికుల కోసం కదులుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, చిరంజీవి, అల్లరి నరేష్, రామ్ చరణ్ లాంటి హీరోలంతా సిఎం రిలీఫ్ ఫండ్‌తో పాటు సినిమా కార్మికులకు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు కూడా తన వంతుగా 25 లక్షలు ఇచ్చాడు. ఇప్పటికే ఈయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించాడు. ఇప్పుడు షూటింగ్స్ లేక.. పని లేక అల్లాడిపోతున్న సినిమా కార్మికుల కోసం ఈ మొత్తం ఇచ్చాడు సూపర్ స్టార్. 

మరోవైపు నాగార్జున కోటి రూపాయలు మొత్తం సినిమా కార్మికుల కోసమే ఇచ్చాడు. ఇక మహేష్ బాబు ప్రభుత్వాన్ని కూడా ప్రశంసించాడు. కరోనా వైరస్ అరికట్టడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న చర్యలపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ బాధ్యత గల వ్యక్తిగా ఇంట్లోంచి కాలు బయటికి పెట్టకూడదని.. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దంటూ కోరాడు మహేష్ బాబు. అందరూ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాలని.. 21 రోజులు ఇంట్లోనే ఉండాలని కోరాడు సూపర్ స్టార్. 

అందరూ లాక్ డౌన్ రూల్స్ పాటిద్దామంటూ లెటర్ విడుదల చేసాడు. మానవత్వం గెలుస్తుంది.. కచ్చితంగా ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తామంటూ తెలిపాడు మహేష్ బాబు. మనకు మనమే రక్షణగా ఉండాల్సిన సమయం వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. 

More Related Stories