English   

మహేష్ బాబు బ్యానర్ నుండి మరిన్ని సినిమాలు...ఆ హీరోలే టార్గెట్ 

Mahesh Babu
2020-06-04 12:56:04

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను అందరూ ఎలా ఫాలో అవుతారో తెలియదు కానీ మన తెలుగు స్టార్స్ మాత్రం బాగా ఫాలో అవుతారు. ఎందుకంటే నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నప్పుడే వీరు తమ డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి దానిని రెండింతలు చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఎవరూ మినహాయింపు కాదు. స్టార్ నటుల నుండి చిన్నా చితకా వారి దాకా అందరూ ఈ సూత్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు. మహేష్ విషయానికి వస్తే ఆయన ఇప్పటికే పలు బిజినెస్ చేస్తున్నారు. నిర్మాణం కూడా మొదలు పెట్టి జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిట్ బ్యానర్ తో తాను నటిస్తున్న ప్రతి సినిమాకు నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్ర నిర్మాతలలో ఒకరిగా ఉన్న మహేష్.. పరుశురామ్ తో చేస్తున్న సర్కారు వారి పాట మూవీ సహా నిర్మాతగా కూడా వ్యవహరించనున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సంస్థ ద్వారా శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు కూడా నిర్మించారు. అంతేకాక మహేష్ తాను కూడా మరో హీరో అడివి శేషుతో మేజర్ అనే సినిమా తీస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఇక ఈయన ఒక్కడికే పరిమితం కాకుండా మహేష్ మరింత మంది హీరోలతో సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నారట. ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ మరియు కార్తీ వంటి హీరోలు కూడా ఉన్నారని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది అనేది తెలియాల్సి ఉంది.
 

More Related Stories