English   

ప్రభాస్ తర్వాత ఆ రికార్డు సాధించిన మహేష్ బాబు..

Mahesh Prabhas
2020-01-21 18:27:51

బాహుబలి సినిమాతో ప్రభాస్ తెలుగు సినిమాకే కాకుండా ఇండియన్ ఇండస్ట్రీలో స్టార్ గా నిలబడిపోయాడు. ఆ సినిమాతో ఈయన చాలా రికార్డులు తిరగరాశాడు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో కూడా ప్రభాస్ సృష్టించని సంచలనాలు లేవు. బాహుబలి 2 భాగాలు కలిపి దాదాపు 30 మిలియన్ వసూలు చేశాయి. ఇక ఆ తర్వాత విడుదలైన సాహో సినిమా కూడా 3 మిలియన్ క్లబ్ లో చేరిపోయింది. 

తెలుగులో ఇలా మూడు సార్లు 2 మిలియన్ అంతకంటే ఎక్కువ వసూలు చేసిన హీరోగా ప్రభాస్ ఒక్కడే ఇన్ని రోజులు ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయనకు తోడుగా మహేష్ బాబు కూడా వచ్చాడు. సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా 2 మిలియన్ క్రాస్ చేయడంతో ఈ రికార్డును అందుకున్నాడు సూపర్ స్టార్. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి మహేష్ బాబు కెరీర్లో నెంబర్ వన్ సినిమాగా నిలిచిపోయింది.

దీనికి ముందు శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో 2 మిలియన్ క్లబ్ లో చోటు సంపాదించాడు మహేష్ బాబు. తెలుగు ఇండస్ట్రీలో ఇలా మూడుసార్లు 2 మిలియన్ క్రాస్ చేసింది ప్రభాస్, మహేష్ బాబు మాత్రమే. మిగిలిన హీరోల ఎవరికీ సాధ్యం కాలేదు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు రెండుసార్లు ఈ రికార్డు అందుకున్నారు.

More Related Stories