English   

హీరోగా మహేష్ బాబు వారసుడు

mahesh babu family
2018-03-02 09:16:37

తెలుగు పరిశ్రమ అంతా వారసుల మయం అయిపోయి చాలాకాలం అయింది. ఇప్పటికే రెండు మూడు తరాల తారలు హీరోలుగా తిష్టవేసుకున్నారు. మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పడు మూడో తరం హీరో వస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆయన మొదటి తనయుడు రమేష్ బాబు హీరో అయ్యాడు. మొదట్లో ఫర్వాలేదనిపించినా.. తర్వాత రేస్ లో నిలవలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన మహేష్ బాబు సూపర్ స్టార్ కు సరైన వారసుడిగా నిలిచాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ రేంజ్ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. రమేష్ బాబు నిర్మాతగా బ్యాక్ గ్రౌండ్ లో సెటిల్ అయిపోయాడు. అయితే ఇప్పుడీ ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరో వస్తున్నాడు.

రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా రాబోతున్నాడు. ఇప్పటికే అతను స్టార్ మేకర్ గా చెప్పుకునే సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలోనే జయకృష్ణ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. ఈ మేరకు ఇప్పటికే తెరవెనక ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. అయితే తరాల మాట పక్కన బెడితే కృష్ణగారి తర్వాత ఆ రేంజ్ కు ఎదిగింది ఒక్క మహేష్ బాబే. అటు నరేష్ కానీ ఆయన తనయుడు కానీ, రమేష్ కానీ, మంజుల కానీ ఏ ఎవరూ ఇండస్ట్రీలో ది బెస్ట్ పొజిషన్ లేరు. వీరిలో నరేష్ చాలా వరకూ బెటర్. కానీ ఆయన్ని కృష్ణ అభిమానులు అంత దగ్గరగా చూశారు అనుకోలేం. బట్ ఇప్పుడు వస్తోన్న జయకృష్ణతో తను సాధించలేనిది సాధించాలనే కసితో ఉన్నాడు రమేష్ బాబు. వారసత్వంతో పాటు టాలెంట్ కూడా ఉంటే అదేమంత అసాధ్యం కాదు. కానీ మరీ ఎన్ని తరాల్నని మోస్తారీ ఫ్యాన్స్ అనేదే అర్థం కాదు..

More Related Stories