English   

మహేష్ అభిమానులకు కోపం వచ్చింది

Mahesh Babu Fans Angry on Goodachari Heroine Sobhita Dhulipala And Nagarjuna
2018-08-12 07:20:48

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో. ఇందులో డౌట్ లేదు. అలాగే ఆయన పర్సనల్ గా సాఫ్ట్ మ్యాన్. ఇంకా చెబితే పక్కా జెంటిల్మన్. మంచి హ్యూమన్ బీయింగ్ కూడా అని చెబుతారు. మాస్ సినిమాలు చేసినా క్లాస్ హీరోగా మహేష్ కు తిరుగులేని ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కు తగ్గట్టుగా ఇతర హీరోల అభిమానులకు భిన్నంగా మహేష్ బాబు అభిమానులు కాస్త జెంటిల్ గా ఉంటారనే టాక్ ఉండేది. ఉండేది అని ఎందుకన్నామంటే.. ఇప్పుడు లేదు కాబట్టి. ఇండస్ట్రీలో రకరకాల వ్యక్తులుంటారు. రకరకాల అభిప్రాయాలూ ఉంటాయి. మనస్తత్వాలూ ఉంటాయి. అందరి మనస్తత్వాలూ, అభిప్రాయాలూ మనలాగే ఉండాలనుకుంటే మనం మనుషులం అనిపించుకోలేం. ఈ విషయంలో మహేష్ బాబు అభిమానులు కూడా ఈ మధ్య ఇతర హీరోల ఫ్యాన్స్ లా హద్దులు మీరుతున్నారనే చెప్పాలి.

ఇంతకీ ఈ మేటర్ అంతా ఎందుకంటే.. తమకు నచ్చే హీరో కోసం వారేమైనా చేస్తారు. వారిలాగే అందరూ చేయాలనే మొండిపట్టదలకు వెళ్లేది అభిమానం అనిపించుకోదు... హద్దుమీరడం అవుతుంది. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కూడా ఇదే చేస్తున్నారు కాబట్టే ఈ ఉపోద్ఘాతం అంతా. విషయం ఏంటంటే.. లేటెస్ట్ గా గూఢచారి సినిమా మహేష్ బాబు చూశాడు. సినిమా చాలా బావుందని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ను కోట్ చేస్తూ గూఢచారి హీరోయిన్ శోభిత ధూళిపాల్ల ‘‘థ్యాంక్యూ’’ అని రిప్లై ఇచ్చింది. ఇందులో తప్పేమీ లేదు కదా.. కానీ మహేష్ బాబు అభిమానులకు అందులో చాలా మిస్టేక్ కనిపిచింది. థ్యాంక్యూ అంటే సరిపోదట. థ్యాంక్యూ సర్ అనాలట. సర్ అనలేదని పాపం ఆ హీరోయిన్ పై ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేశారు. చివరికి ఆ బ్యూటీ తన మాటకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంటే వీరికి భయపడో తను తప్పు చేశాననో భావంతో కాదు.. అనవసరమైన ‘తలనొప్పి’ ఎందుకనే..  శోభిత తర్వాత ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ అక్కినేని నాగార్జున పై పడ్డారు.

మామూలుగా తనకేదైనా నచ్చితే భేషజాలు లేకుండా వెంటనే చెప్పే స్టార్ నాగార్జున. ఈయన గూఢచారి సక్సెస్ మీట్ కు వచ్చాడు. ఈ సినిమాను గురించి పొగుడుతూ ఇది శివ స్థాయి సినిమా అన్నాడు. తర్వాత ఈ యేడాది మంచి హిట్స్ గా నిలిచిన సినిమాలంటూ మహానటి, రంగస్థలం, గూఢచారి అన్నాడు. అంతే.. ఈ లిస్ట్ లో తమ అభిమాన నటుడు మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ లేదు అని నాగ్ పైనా తెగ నోరు పారేసుకుంటున్నారా ఫ్యాన్స్. అయినా ఆఫీసర్ వంటి సినిమా చేసినవాడికి తమ విజయం ఎలా కనిపిస్తుందిలే అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది మరీ హద్దులు మీరి కనిపిస్తోంది.

నిజానికి భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ అన్నా.. కలెక్షన్స్ ఎన్ని చూపించినా.. కొన్ని వారికి ఎగ్జిబిటర్స్ కు పెద్దగా లాభాలు తెచ్చింది లేదు. మరి వీళ్లంతా ఎందుకు ఇలా ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారో కానీ.. ఇప్పటి వరకూ ఈ లిస్ట్ లో మహేష్ బాబు అభిమానులు ఉండేవాళ్లు కాదు. కానీ లేటెస్ట్ గా గూఢచారి తర్వాత నుంచి వాళ్లు కూడా చేరారు. అంత అభిమానం ఉన్నవీ ళ్లు ఒక్కసారి మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ఆడియో ఫంక్షన్ లో(మేం మేం బానే ఉంటాం.. మీరే.. అంటూ చెప్పాడు కదా) చెప్పిన మాటలు గుర్తు చేసుకుని అందుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే మంచిది.. ఏదేమైనా మహేష్ బాబు అభిమానులు సాఫ్ట్ అని ఇన్నాళ్లూ అనుకున్నవాళ్లు ఇకపై తమ అభిప్రాయం మార్చుకుంటారు.

More Related Stories