English   

మ‌హేశ్ కంటే తోపెవ్వ‌డు లేడిక్క‌డ..!

maheshbabu
2018-07-22 18:24:38

అవును.. ఇప్పుడు నిజంగానే మ‌హేశ్ కంటే తోపెవ్వ‌డూ ద‌క్షిణాది ఇండ‌స్ట్రీలోనే లేడు. సినిమాల విష‌యంలో ఏమో కానీ సోష‌ల్ మీడియాలో మ‌హేశ్ ను బీట్ చేసే హీరో ఈ ద‌రిదాపుల్లో క‌నిపించ‌డం లేదు. ఈ ఫాలోయింగ్ లో సూప‌ర్ స్టార్ కంటే తోపు ఎవ‌రూ లేరు. ట్విట్ట‌ర్ ఫాలోయ‌ర్స్ లో కొత్త రికార్డు సృష్టించాడు మ‌హేశ్ బాబు. 6.63 మిలియన్ ఫాలోవర్స్ అంటే అక్ష‌రాలా 63 ల‌క్ష‌ల మంది మ‌హేశ్ ను ట్విట్ట‌ర్ లో ఫాలో అవుతున్నారు. ఇది నిజంగా ఓ రికార్డ్. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు సౌత్ ఇడియాలోనే లేరు. ఇక ఇన్ స్టాగ్రామ్ లో 15 ల‌క్ష‌ల మంది.. ఫేస్ బుక్ లో 50 ల‌క్ష‌ల మంది మ‌హేశ్ ను ఫాలో అవుతున్నాయి. 

మొత్తంగా ఈయ‌న్ని కోటి 30 ల‌క్ష‌ల మంది మ‌హేశ్ బాబును సోష‌ల్ మీడియాలో ఫాల్ అవుతు న్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యంలో ధ‌నుష్.. సూర్య‌.. రానా.. అల్లు అర్జున్.. ప్ర‌భాస్ లాంటి స్టార్స్ అంద‌ర్నీ దాటేసాడు సూప‌ర్ స్టార్. ఎంత‌మంది ఉన్నా మ‌హేశ్ ను బీట్ చేసే వాళ్లైతే లేరు. ప్రతీ చిన్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో అభిమానుల‌తో పంచుకోవ‌డం సూప‌ర్ స్టార్ కున్న అల‌వాటు. ఇదే ఆయ‌న్ని సోష‌ల్ మీడియాలో నెంబ‌ర్ వ‌న్ ను చేసింది. ప్ర‌స్తుతం ఈయ‌న వంశీ పైడిప‌ల్లి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది వ‌చ్చే ఏడాది ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది. మొత్తానికి సోష‌ల్ మీడియా కింగ్ గా చ‌క్రం తిప్పేస్తున్నాడు మ‌న సూప‌ర్ స్టార్. 

More Related Stories