రిషి.. మహర్షి గ ఎలా మారాడు..?

రిషి అని ముందు నుంచి సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చాడు వంశీ పైడిపల్లి. ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్ లో మాత్రం సడన్ గా మహర్షి అని విడుద పరిచయం చేసాడు తన హీరో మహేష్ ను. రిషి అనే టైటిల్ బాగానే అనిపించినా.. మహేష్ కు రెండు అక్షరాల పేర్లు కలిసిరాలేదు. అందుకే రిస్క్ ఎందుకు అని మళ్లీ టైటిల్ విషయంలో కాంప్రమైజ్ అయిపోయినట్లు తెలుస్తుంది. అందుకే రిషి కారెక్టర్ నేమ్ ఉంచేసి.. టైటిల్ మాత్రం మహర్షిగా తీసుకొచ్చారు. మహర్షి కూడా ఫ్లాప్ టైటిల్ కావడం విశేషం. అయితే మూడు అక్షరాల పేర్లు మహేష్ బాగానే కలిసొచ్చాయి. మహర్షి లుక్ కూడా అదిరిపోయింది. సూపర్ స్టార్ కూడా రొటీన్ కంటే కాస్త కొత్తగా ఉన్నాడు. మీసాలతో కాలర్ ఎగరేస్తూ అలా నడిచొస్తుంటే చూడ్డానికి కొత్తగా అనిపిస్తుంది. ఇక సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుందని.. రీ ఫ్రెషింగ్ గా అనిపిస్తుందని ధీమాగా చెబుతున్నాడు దర్శకుడు వంశీ. రైతుల కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో పాటు నరేష్ కీలకపాత్రలో నటిస్తుండటం కూడా సినిమాపై ఆసక్తి పెంచేస్తుంది. రెండేళ్లకు పైగానే కూర్చుని ఈ కథ సిద్ధం చేసుకున్నాడు వంశీ పైడిపల్లి. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి కలిసి నిర్మిస్తున్నారు. ఎప్రిల్ 5, 2019న విడుదల కానుంది మహర్షి.