English   

ఫ్యాన్స్ పిచ్చోళ్లేం కాదు.. కానీ చేస్తున్నారు..!

Mahesh Babu fans
2018-08-05 08:00:04

ఇప్పుడు మహేష్ బాబును చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. త‌మ అభిమాన హీరోకు సంబంధించిన ఏ పోస్ట‌ర్ వ‌చ్చినా.. ఏ లుక్ వ‌చ్చినా పిచ్చోళ్ల‌లా వేచి చూస్తుంటారు పాపం అభిమానులు. అందులో ఏముంటుందో.. కొత్త‌గా ఏం చెబుతారో.. సినిమా గురించి ఏదైనా ఆస‌క్తిక‌ర‌మైన అంశాన్ని బ‌య‌ట పెడ్తారో అని క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తుంటారు. కానీ సూప‌ర్ స్టార్ మాత్రం ఫ్యాన్స్ ను ప్ర‌తీసారి పిచ్చోళ్ల‌నే చేస్తున్నాడు. ఈయ‌న త‌న సినిమాపై అభిమానులు  చూపిస్తున్న ప్రేమ‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేస్తున్న‌ట్లు ఉన్నాడు. అందుకే పోస్ట‌ర్ అని చెప్పి.. క‌నీసం లుక్ కూడా విడుద‌ల చేయ‌లేదు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టిస్తోన్న సినిమా లుక్ ఆగ‌స్ట్ 9న బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌ల కానుంది.

ఆ లోపు ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తున్నాం అంటే ఎలా ఉంటుందో అని క‌ళ్ల‌లో ఒత్తులేసుకుని మ‌రీ చూసారు. తీరా చూస్తే అది పోస్ట‌ర్ కాదు.. ఎస్ఎస్ఎస్బి 25 అంటూ ఓ కౌంట్ డౌన్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. దాన్ని కూడా మహేష్ కూతురు సితార‌.. వంశీ కూతురు ఆద్య క‌లిసి విడుద‌ల చేసారు. ఫ్యాన్స్ పిచ్చి ఏ స్థాయిలో ఉందంటే.. అందులో ఏం లేద‌ని తెలిసినా కూడా ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లో ఉంది. ఇది మహేష్ పై ఫ్యాన్స్ కు ఉన్న ప్రేమ‌. దీన్ని ఇలా వాడేసుకుంటున్నాడు సూప‌ర్ స్టార్.

More Related Stories