English   

సుధీర్ బాబు పెద్ద టార్చర్ పార్టీ అంటగా..?

big-boss-anthem
2018-08-22 16:34:31

సుధీర్ బాబు నిర్మాతగా మారాడు. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి తొలి సినిమాగా ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ విషయంలో తన ప్రొడక్షన్ లో వస్తోన్న సినిమాలో అతను పెద్ద టార్చర్ పార్టీలా మారాడు. తన కింద పనిచేసే ఉద్యోలను దారుణంగా చూస్తున్నాడట. దీంతో వాళ్లంతా బిగ్ బాస్ హౌస్ లోని బిగ్ బాస్ వీడురా అంటూ పాటేసుకున్నారు. అతను పెడుతోన్న టార్చర్స్ అన్నిటినీ ఏకరువు పెడుతూ అంతా కలిసి బుర్రలు హీటయ్యేలా పాట పాడుకున్నారు. ఏంటీ.. ఇదంతా అనుకుంటున్నారా..? 

నన్ను దోచుకుందువటే సినిమా నుంచి ఓ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఆ పాటే ఇదంతా. దీనికి ఏం పేరు పెట్టారో తెలుసా.. ‘బిగ్ బాస్ ఆంథెమ్’. ఆ మధ్య విడుదల చేసిన నన్ను దోచుకుందువటే టీజర్ లోనే సుధీర్ బాబు పాత్ర ఎలా ఉంటుందో పరిచయం చేశారు. కానీ అది జస్ట్ టీజరే.. కానీ సినిమాలో ఆయన ఏ రేంజ్ లో తన ఎంప్లాయీస్ ను ఆడుకుంటాడు అనేదానికి నిదర్శనంగా ఈ పాట కనిపిస్తోంది.

ఇక ఏ మాటకామాట... ఈ పాట చిత్రీకరణ అద్భుతంగా ఉంది. చిన్న చిన్న పరిమితుల్లో అదిరిపోయే గ్రాఫిక్స్ తో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉందీ సాంగ్. అలాగే బాస్ టార్చర్ ను కూడా బాగా ఎలివేట్ చేసేలా లిరిక్స్ ఉన్నాయి. బి అజనీష్ లోకనాథ్ సిఆర్ బాబీ మ్యూజిక్ ప్రొడక్షన్ సంగీతం అందించారు. ఇక ఈ పాట పాడింది టిప్పు, హర్షిక దేవనాథన్.  సింపుల్ గా ఉన్నా రిచ్ గా కనిపిస్తోన్న ఈ ఆంథెమ్ సినిమా ప్రమోషన్స్ లో బాగా ఉపయోపడుతుందనే చెప్పాలి. ఇక సుధీర్ బాబు సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి ఆర్ఎస్ నాయుడు దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ మూవీని సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నారు.

More Related Stories