English   

సౌత్ ఆఫ్రికా బయలుదేరిన మహేష్ బాబు !

Mahesh-Babu
2019-03-15 01:31:32

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇంకా కొంత టాకీ, ఒకటి రెండు పాటలు మిగిలి ఉన్నాయి. వీలయినంత త్వరలో వాటి షూట్ కూడా పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టె యోచనలో ఉన్నారు దర్శకుడు. అయితే తాజాగా చెన్నైలో ప్లాన్ చేసిన షెడ్యూల్ పూర్తయ్యింది. అది పూర్తవ్వగానే నిన్న సాయంత్రం మహేష్ బాబు సౌత్ అఆఫ్రికా బయలుదేరి వెళ్లారు. ఆయన అక్కడ ఒక యాడ్ షూట్ లో పాల్గొననున్నారు. మహేష్ బాబు ఇప్పుడు థమ్సప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆ యాడ్ షూట్ కోసం ఆఫ్రికా వెళ్ళాడు. దాదాపు ఐదు రోజుల పటు యాడ్ షూట్ చేయనున్నారు. అది పూర్తయ్యాక ఆయన వచ్చే వారం హైదరాబాద్ చేరుకోనున్నాడు. ఆయన వచ్చాక పూజాతో కలిసి కొన్ని పాటలకి నర్తించనున్నాడు. ఇక ఈ మహర్షి సినిమాని దిల్ రాజు, అస్వినీదత్, పీవీపీ ముగ్గురూ కలిసి నిర్మిస్తుండగా మే9న రిలీజ్ కి ప్లాన్ చేశారు నిర్మాతలు.

More Related Stories