English   

మహేష్ బాబు మూవీ తేడా కొడుతోందా..?

mahesh babu
2018-02-18 11:23:30

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సాలిడ్ హిట్ పడి చాలా రోజులైనట్టుంది. మధ్యలో శ్రీమంతుడు లేకపోయి ఉంటే మహేష్ రేంజ్ ఎప్పుడో మారిపోయేది. రీసెంట్ గా వచ్చిన స్పైడర్ బ్రహ్మోత్సవాన్ని మించిన ఫ్లాప్ గా నిలిచింది. చివరికి బుల్లితెరపై కూడా స్పైడర్ భారీ డిజాస్టర్ అయింది. ప్రస్తుతం తన లక్కీ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు మహేష్. భరత్ అనే నేను పేరుతో తెరకెక్కుతోన్న ఈమూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలైందంటున్నారు. ఏప్రిల్ 26న ఈ మూవీని విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే నెక్ట్స్ మహేష్ బాబు చేయబోయే సినిమాపై అప్పుడే అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి..

భరత్ అనేనేను మహేష్ బాబు 24వ సినిమా. తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన క్రేజీ ప్రాజెక్ట్ గా 25వ సినిమా స్టార్ట్ కాబోతోంది. అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీపై అప్పుడే డౌట్స్ మొదలయ్యాయి కొందరిలో. అందుకు కారణం ఈ మూవీ షూటింగ్ లొకేషన్సే అంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ మేజర్ షూటింగ్ అంతా విదేశాల్లోనే జరుగుతుందట. ముఖ్యంగా న్యూ యార్క్ లో ఎక్కువభాగం షూట్ చేస్తారట. ఈ మేరకు దర్శకుడు లొకేషన్స్ కూడా ఫైనల్ చేశాడు. గతంలో మహేష్ బాబు సుకుమార్ కాంబోలో వచ్చిన ఒన్ నేనొక్కడినే కూడా మేజర్ పార్ట్ షూటింగ్ అంతా లండన్ లో చేశారు. కాన్సెప్ట్ బావున్నా సినిమా పోయింది. విదేశీ లొకేషన్ వల్లే సినిమా మనాళ్లకు ఎక్కువగా కనెక్ట్ కాలేదని అప్పట్లో టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ మూవీ కూడా న్యూ యార్క్ లో 80శాతం షూటింగ్ అంటున్నారు. అంటే ఇది కూడా.... అవుతుందా అనే డౌట్స్ వెలిబుచ్చుతున్నారు కొందరు. మరోవైపు ఒన్ నేనొక్కడినేకి, దీనికి కూడా దేవీశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు. ఇలా రకరకాల కంపారిజన్స్ తో చాలామంది ఈ మూవీపై డౌట్స్ పెంచుకుంటున్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ 25వ సినిమా కూడా భారీ అంచనాల మధ్య వచ్చి బోల్తా పడింది. అందుకే అభిమానుల్లోనూ కొందరు అప్పుడే ఈ మూవీ తేడా కొడుతోంది అనుకుంటున్నారని టాక్.

More Related Stories