English   

మూవీ పిఆర్ఓ లకు హెల్ప్ చేస్తున్న హీరోలు

Mahesh Babu Naga Chaitanya Helping Chi La Sow Goodachari PROs

ఓ సినిమాను హిట్ చేయాల‌న్నా.. దాన్ని ప్రేక్ష‌కుల చెంత‌కు చేరువ చేయాల‌న్నా ముందు పిఆర్ఓ అనేవాడు కీల‌కం. పిఆర్ స‌రిగ్గా ఉంటే ఎలాంటి సినిమా అయినా ప్రేక్ష‌కుల‌కు ఈజీగా ద‌గ్గ‌ర‌గా వెళ్తుంది. అందుకే ఏ సినిమాకైనా కూడా టాప్ పిఆర్ఓల‌ను తీసుకుంటారు నిర్మాత‌లు. ఇప్పుడు ఈ ప‌ని కూడా స్టార్ హీరోలే చేస్తున్నారు. వీళ్లు న‌ట‌న‌తో పాటు పిఆర్ వ‌ర్క్ కూడా చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ద‌ర్శ‌కులు కూడా హీరోల‌కు సాయం చేస్తుండ‌టం విశేషం. కావాలంటే చూడండి.. శ్రీ‌నివాస క‌ళ్యాణంపై ఇప్ప‌టికే అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇంత‌గా ఉన్నా కూడా ఇప్పుడు ఈ చిత్రం కోసం వంశీ పైడిప‌ల్లి పిఆర్ గా మారిపోయాడు.

ఈ సినిమా చూసిన త‌ర్వాత ఊరుకోకుండా సినిమా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేసాడు. ఇక గూఢ‌చారి సినిమా చూసిన త‌ర్వాత మహేష్ బాబు కూడా సినిమా సూప‌ర్ అనేసాడు. ఈయ‌న చేసిన ఒక్క ట్వీట్ సినిమా క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూపిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా ప‌రుగులు తీస్తుంది. నాగ‌చైత‌న్య కూడా చిల‌సౌ కోసం చ‌మ‌టోడ్చాడు. పిఆర్ఓ చేయాల్సిన ప‌నులు కూడా మ‌న హీరోలే ధైర్యంగా చేస్తున్నారు ఇప్పుడు. దాంతో కొన్ని సినిమాల‌కు క‌లెక్ష‌న్లు కూడా అదే రేంజ్ లో వ‌స్తున్నాయి. కేవ‌లం వీళ్లు చేస్తోన్న ప్ర‌మోష‌న్ కార‌ణంగానే కొన్ని సినిమాలు బాగా వ‌సూళ్లు సాధిస్తున్నాయి. అలా పిఆర్ఓల భారాన్ని మ‌న హీరోలు బాగానే దించేస్తున్నారిప్పుడు. ఇలా హీరోల ఒక్క ట్వీట్ వల్ల పిఆర్ఓ లకు సగానికి పైగా ఒత్తిడి తగ్గిపోతుంది.

More Related Stories