English   

మంచు విష్ణు భార్య బర్త్ డే పార్టీలో మహేష్ నమ్రత సందడి

Mahesh Babu Namrata
2021-01-16 17:01:44

శుక్రవారం మంచు విష్ణు భార్య విరానిక రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సూపర్ స్టార్ మహేష్, బాబు ఆయన సతీమణి నమ్రత కూడా హాజరయ్యారు. అంతే కాకుండా హీరో గోపిచంద్ కూడా బర్త్ డే లో సందడి చేసారు. వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా మహేష్ బాబు జంటతో కలిసి దిగిన ఫోటోను మంచు విష్ణు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఫొటోలో మంచు విష్ణు భార్య విరానిక, విష్ణు, నమ్రత, మహేష్ ఉన్నారు. 

ఆ ఫొటోకు విష్ణు "ఈ ఫొటోలో ఉన్న వ్యక్తుల్లో ఒకరు రోజు రోజుకు యంగ్ గా..హ్యాండ్సమ్ గా తయారవుతున్నారు. అది కేవలం ఆయన మంచి హృదయం, మనస్సు కలిగి ఉండటం వల్లే అని నేను గట్టిగా నమ్ముతున్నాను" అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. మహేష్ బాబును ఉద్దేశించి మంచు విష్ణు ఈ కామెంట్స్ చేసినట్టు అర్థమవుతుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అందాన్ని కేవలం హీరోయిన్ మాత్రమే కాకుండా హీరోలు కూడా పొగడటం ఇది కొత్త కాదు. ఎన్నో సంధర్భాల్లో టాలీవుడ్ లోని పలువురు హీరోలు మహేష్ హ్యాండ్సమ్ అని ఒప్పుకున్నారు. కానీ విష్ణు మహేష్ హ్యాండ్సమ్ అని..అంతే కైండ్ హార్టెడ్ అని పేర్కొన్నారు.
 

More Related Stories