English   

మహేష్ 27 కి మరో దర్శకుడి పేరు...

Mahesh Babu.jpg
2020-02-25 17:57:19

టాలీవుడ్ లో ప్రస్తుతం ఏదయినా ట్రేండింగ్ టాపిక్ ఉందంటే అది కేవలం మహేష్‌ 27 మాత్రమే అని చెప్పచ్చు. మొన్ననే ‘సరిలేరు నీకెవ్వరు’ విజయం అందుకున్న మహేష్‌ తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లితో చేస్తున్నట్లు ఆ సినిమా విజయోత్సవం సమయంలో ప్రకటించాడు. అయితే ఆ సినిమా ఆగిపోయిందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజం ఎంతుందో తెలీదు కానీ ప్రచారాలు అయితే మామూలుగా జరగడం లేదు.

మహేష్ పైడిపల్లి ప్రాజెక్ట్ కొంతకాలం తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు చేసి తెరకెక్కించనున్నారట. ఈ లోపు మరో సినిమా పట్టాలెక్కించేందుకు మహేష్‌ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలో నటించబోయే చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వంలో వహిస్తాడని ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇదిలా ఉండగానే మరో సినిమాని కూడా మహేష్ లైన్లో పెట్టాలని భావిస్తున్నాడని అంటున్నారు.

తాజాగా మహేష్ కి గరుడవేగ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు ఓ కథ వినిపించాడని అంటున్నారు. మహేష్ విన్న ఆ కధ కొత్తగా ఉండటంతో మహేష్‌ కూడా వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు మహేష్ ఏ సినిమా చేయనున్నాడనేది తెలియాలి.

More Related Stories