English   

పంచెకట్టులో మహేష్ సూపర్ 

Mahesh-Panche-Bharat-ane-Nenu

సూపర్ స్టార్ మహేష్ బాబు పంచెకట్లులో అదుర్స్ అనిపిస్తున్నాడు. అచ్చ తెలుగు పంచెకట్టు, భుజంపై కండువాతో సచివాలనయానికి వెళుతున్నట్టున్నాడు.వెనక సెక్యూరిటీ ఉంది. చుట్టూ జనం నమస్కారం పెడుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ అంతా ఉగాది వెలుగులు కనిపిస్తున్నాయి. అయితే పంచెకట్టులో మహేష్ బాబు మాత్రం అదిరిపోయాడనే చెప్పాలి. ఉగాది సందర్భంగా విడుదల చేసిన ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ ఇలాంటి లుక్ లో కనిపించలేదు మహేష్ బాబు. అందుకే ఇది మరింత స్పెషల్ గా కనిపిస్తోంది. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తోన్న భరత్ అను నేనుపై భారీ అంచనాలే ఉన్నాయి. వాటిని అందుకునేందుకు అన్ని రకాలుగా రెడీ అయినట్టు కనిపిస్తున్నాడు భరత్.  నిజానికి ఇలాంటి లుక్ గతంలో ఈ ఇద్దరూ కలిసి చేసిన శ్రీమంతుడులో కూడా కనిపిస్తుంది. కాకపోతే అప్పుడు లుంగీతో కనిపిస్తాడు. మహేష్ లుంగీతో కనిపించడం కూడా అప్పటికి ఫస్ట్ టైమ్. దీంతో ఆ లుక్ గురించి అప్పట్లో చాలా చర్చించుకున్నారు. కానీ ఇది ఏకంగా పంచె కట్టేయడం మాత్రం భలే ఉంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ ఏప్రిల్ 20న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికి ఉన్న అంచనాలను బట్టి చూస్తే భరత్ అనేనేను బ్లాక్ బస్టర్ అంటున్నారు.. 

More Related Stories