English   

మహేష్ బాబు పారిస్ మొత్తం చుట్టేస్తున్నాడు

Mahesh-babu

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆనందం వచ్చినా, బాధ వచ్చినా వెకేషన్ కు వెళుతుంటాడనేది అందరికీ తెలుసు. అయితే భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ తో మహేష్ కు ఇప్పుడు పట్టరాని ఆనందం వచ్చింది. దీంతో ఫ్యామిలీతో కలిసి పారిస్ ట్రిప్ వేశాడు. టాలీవుడ్ లో మహేష్ లాగా ఫ్యామిలీతో కలిసి ఇలా ట్రిప్పులకు వెళ్లే స్టార్ మరొకరు లేరు. కుటుంబానికి అంత ప్రాధాన్యం ఇస్తాడు మహేష్ బాబు. ఓ మూడేళ్ల పాటు సరైన హిట్ కోసం నానా తంటాలు పడ్డ మహేష్ కు భరత్ అనేనేను భారీ ఊరటనిచ్చింది. కమర్షియల్ గా పెద్ద విజయం సాధించడంతో పాటు విమర్శకుల నుంచీ విపరీతమైన ప్రశంసలు అందుకుందీ సినిమా. అటు మహేష్ నటనకు మరోసారి క్లాప్స్ పడ్డాయి. ఈ ఆనందాన్ని చాలా రోజుల పాటు మీడియాతో షేర్ చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా భరత్ ప్రమోషన్స్ కోసం చాలా దూరాలు ప్రయాణించాడు. చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇక భరత్ బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ కావడంతో ఇలా ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కు వెళ్లాడు. 

ఇక ఈ వెకేషన్ తర్వాత వక్కంతం వంశీ డైరెక్షన్ లోసినిమా స్టార్ట్ అవుతుంది. అది మహేష్ కు 25వ సినిమా. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటూనే క్లెవర్ నెరేషన్ తో సాగే కథ ఇది అని చెబుతున్నారు. ఈ సినిమా కూడా చాలా భాగం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకోబోతోంది. అందుకోసం వంశీ ఇప్పటికే లొకేషన్స్ ఫైనల్ చేసుకున్నాడు. ఇక మహేష్ బాబు వెకేషన్ నుంచి తిరిగి వస్తే ఈ సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అవుతుంది. ఏదేమైనా మహేష్ లా ఫ్యామిలీకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఇంకెవరూ కనిపించరు.. ఒకవేళ అదే అతని సక్సెస్ సీక్రెటేమో.. 

More Related Stories