English   

రవిబాబు అందులో మాస్టర్...మహేష్ ప్రసంశలు

Mahesh babu
2019-10-01 11:59:48

ఈ మధ్య టాలీవుడ్‌ హీరోలు మంచి సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. సినిమా బడ్జెట్ లు, లాంటివి పట్టించుకోకుండా సినిమాల మీద తమ తమ ఇష్టాలను పంచుకుంటూ చిన్న సినిమాలకి ప్రాణం పోస్తున్నారు. టీజర్‌, ట్రైలర్స్‌ విడుదలైన సమయంలో కూడా వారికి నచ్చితే ఏమీ ఆలోచించకుండా వాటిని వెంటనే షేర్ చేసేసి ప్రశంసలతో ముచ్చెత్తుతున్నారు. తాజాగా ఆవిరి సినిమా తీజర్ మీద కూడా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు కామెంట్‌ చేశారు.

మొన్నామధ్య ‘అదుగో’ అంటూ పంది పిల్లతో ఒక ప్రయోగాత్మక చిత్రం చేసిన రవిబాబు కాస్త వెనక బడ్డాడు. ఇప్పుడు తాజాగా ‘ఆవిరి’ అనే హార్రర్ నేపథ్య చిత్రంతో మన ముందుకుకొస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆవిరి సినిమాను రవిబాబు డైరెక్ట్ చేయడమే కాకుండా తాను కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఇక దిల్‌రాజు సమర్పిస్తున్న ఈ సినిమా టీజర్‌ ను మొన్న ఆదివారం విడుదల చేశారు. 

హారర్‌ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను చూసిన మహేష్ బాబు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. యూనిట్‌ సభ్యులకు ఆల్‌ ది బెస్ట్‌ కూడా చెప్పారు. ‘హారర్‌ జోనర్‌లో తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇలాంటి తరహా సినిమాల్ని తీయడంలో రవిబాబు మాస్టర్‌. మీకు, మీ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్‌ రవి’ అని ఆయన పోస్ట్‌ చేశారు. ఇక ఈ సినిమాలో రవిబాబుతో పాటుగా నేహా చౌహాన్,శ్రీముక్త, భరణి శంకర్,ముఖ్తార్ ఖాన్ నటించారు. 

ఈ సినిమాను ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు స్వీయ నిర్మాణంలో నిర్మించాడు.  అయితే ఈ సినిమా దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కోరిక మేరకే మహేష్ బాబు ఈ త్వీట్ చేసి ఉండచ్చని కూడా కొందరు నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అయితే నిజానికి మహేష్ కి రవిబాబు మురారి సినిమా సమయం నుండే మంచి స్నేహితుడు. వీరిద్దరి కాంబినేషన్లో మురారి, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు లాంటి సినిమాలు కూడా వచ్చాయి.

More Related Stories