English   

అంత ఫ్లాప్ ఇచ్చినా మహేష్ బాబు భలే పొగిడాడుగా

Mahesh-Babu
2018-11-08 19:35:01

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఏ గొడవలూ లేని ఏకైక స్టార్ మహేష్ బాబు. తన ఫ్యాన్స్ కూడా మాగ్జిమం డిసిప్లిన్ గా ఉంటారనేది నిజం. సూపర్ స్టార్ కృష్ణలాగానే మహేష్ బాబు కూడా అజాత శతృవు. అందుకే ఆయనంటే ఆల్మోస్ట్ అందరు స్టార్స్ కు ఇష్టం. అందరి స్టార్స్ ఫ్యాన్స్ కూ ఇష్టం. ఇంకా చెబితే ఏ భేషజం లేని వ్యక్తిగా మహేష్ కు మంచి పేరుంది. ఆ విషయంలో తనెంత పర్ఫెక్ట్ గా ఉంటాడో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.. 

మామూలుగా ఓ దర్శకుడు తమకు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇస్తే ఇక ఆదర్శకుడి మొహం కూడా చూడరు చాలామంది స్టార్స్. మరికొందరైతే ఆ దర్శకుడు మరో కథ చెప్పడానికి ప్రయత్నించినా.. కనీసం కాంపౌండ్ వాల్ కూడా దాటనీయరు. ఇలాంటి సంఘటనలు ఉదాహరణలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అయితే మహేష్ బాబు మాత్రం అలాంటి ఫీలింగ్ చూపించకుండా తనకు బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన మురుగదాస్ ను తెగ పొగిడేశాడు. 

మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సర్కార్’ను మహేష్ చూశాడు. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ ‘‘సర్కార్ ఎంగేజింగ్ పొలిటికల్ డ్రామా. ఇదే మురుగదాస్ ట్రేడ్ మార్క్. నాకు బాగా నచ్చింది. ఎంటైర్ టీమ్ కు కంగ్రాట్స్’’ అని చెప్పాడు. దీంతో ఇది ఊహించని దర్శకుడు మురుగదాస్.. వెంటనే రియాక్ట్ అయ్యాడు. ‘‘థ్యాంక్యూ సర్. మీకు నచ్చడం నా అదృష్టం. ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది’’ అని రీ ట్వీట్ చేశాడు. మొత్తంగా మహేష్ బాబు చేసిన ట్వీట్ కు అభిమానులు కూడా ఆశ్చర్యపోయారంటే అతని సింప్లిసిటీ అర్థం చేసుకోవచ్చు.

More Related Stories