English   

ప్రశాంత్ నీల్, మహేష్ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్

mb
2020-02-17 19:59:53

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం హాలీడే ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మే నుంచి కొత్త సినిమా మొదలు పెట్టనున్నాడు. MB27 పేరుతో ఇప్పటికే ఆ సినిమా ట్రెండ్ అవుతుంది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరించానున్నారు. ఈ సినిమా తర్వాత కొన్ని నెలల సమయం తీసుకుని త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు. సరిలేరు నీకెవ్వరుతో మంచి విజయం అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో మరోసారి వర్క్ ఎఫ్ 3 కోసం చేయనున్నట్టు చెబుతున్నారు. ఇక వీళ్ళ తోనే కాక కెజియఫ్ సినిమాతో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ తో కూడా మహేష్ బాబు ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా కోసం ప్యాన్ ఇండియా కథ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. మొదట్లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేస్తారని, ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. దాదాపు అవే కన్ఫర్మ్ అని అనుకున్నారంతా. కానీ మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని ఇటీవలే కొత్త చర్చ మొదలయింద. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ లో కొత్త పేరు వినిపిస్తోంది. అదే అల్లి అరవింద్ పేరు. నిజానికి మహేష్ గీతా వాళ్లకి ఒక సినిమా చేయాలి. అది పరశురామ్ తో ఉండనుందని అనుకున్నా అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ సినిమాతో మహేష్ ఆ బాకీ తీర్చునున్నాడని అంటున్నారు.

 

More Related Stories