English   

త్రిమూర్తులు అదిరిపోయారుగా..!

Ram-Charan- NTR

ఇండ‌స్ట్రీలో మారుతున్న ప‌రిస్థితులు చూసి పండ‌గ చేసుకుంటున్నారు అభిమానులు. ఒకేసారి స్టార్ హీరోలంతా క‌లిసిపోవ‌డం.. లేదంటే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ల‌కు ఓకే చెప్ప‌డం.. ఓ హీరో ఆడియో వేడుకకు మ‌రో హీరో రావ‌డం.. ఇలా ఒక్కొక్క‌టిగా మారిపోతున్నాయి ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితులు. ఇది నిజంగా మంచి హెల్ప్ అవుతుంది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కూడా. ఇప్పుడు స‌రైన క‌థ తీసుకెళ్తే ఎలాంటి హీరోలైనా క‌లిసి న‌టిస్తార‌ని అర్థ‌మైపోతుంది. దీనికి రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ నిద‌ర్శ‌నం. ఇక మొన్న భ‌ర‌త్ అనే నేను బ‌హిరంగ‌స‌భ అయిపోయిన త‌ర్వాత మ‌హేశ్.. ఎన్టీఆర్.. రామ్ చ‌ర‌ణ్.. ముగ్గురు క‌లిసి పార్టీ చేసుకున్నారు. ఆ త‌ర్వాత కూడా వాళ్లు క‌లిసారు. ఇక ఇప్పుడు మ‌రోసారి అంతా క‌లిసి పార్టీ చేసుకున్నారు. అంతే కాదు.. మొన్న రంగ‌స్థ‌లం చూసి ఎన్టీఆర్, మ‌హేశ్ ఇద్ద‌రూ చ‌ర‌ణ్ ను ఆకాశానికి ఎత్తేసారు. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను చూసి మ‌హేశ్ ను పొగ‌డ్త‌ల్లో ముంచేస్తున్నారు చ‌ర‌ణ్, ఎన్టీఆర్. ఇండ‌స్ట్రీలో ఈ ఫ్రెండ్లీ నేచ‌ర్ ఇప్పుడు అభిమానుల‌కు కూడా సంతోషాన్నిస్తుంది. ఇన్నాళ్లూ మీ హీరో.. మా హీరో అంటూ కొట్టుకు చ‌చ్చిన అభిమానుల‌కు ఇప్పుడు ఇది కొత్త‌గా అనిపిస్తుంది. బ‌య‌ట మీరే కొట్టుకుంటారు.. మేమంతా బాగానే ఉంటామ‌ని హీరోలు ఎప్ప‌ట్నుంచో చెబుతున్నారు. కానీ అభిమానులే ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్పుడు ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. మొత్తానికి ఇప్పుడు మ‌న హీరోల్లో చాలా మార్పులు వ‌చ్చాయి. ఈ మార్పే ఇప్పుడు ఇండ‌స్ట్రీ కొత్త ఊపిరి తీసుకొస్తుంది.

More Related Stories