English   

భార్యకు ప్రేమతో....వెకేషన్ లో మహేష్

mb
2020-01-22 19:42:22

మ‌హేష్ బాబు, న‌మ్రత శిరోద్కర్ జంటకు ఇండ‌స్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆద‌ర్శ దంప‌తులు అంటే ఎలా ఉంటారో వీళ్లను చూసి చెప్పచ్చని చెప్పుకుంటూ ఉంటారు అభిమానులు. పెళ్లై 14 ఏళ్లైయినా ఇప్పటి వ‌ర‌కు చిన్న గొడ‌వ కూడా రాకుండా ఎలాంటి వివాదాల జోలికి పోకుండా హాయిగా ఉన్నారు ఈ జంట‌. ఇండస్ట్రీలో వివాహాలు అది కూడా ఇద్దరూ ఆ ఇండస్ట్రీ నుండి వచ్చిన వారయితే కలకాలం నిలిచి ఉండవని విడాకులు తీసుకుంటారని ఒక అపోహ ఉండేది. ఎందుకంటే ఇక్కడ కలిసుండే వారి కంటే విడాకుల విషయాలకు ఎక్కువగా పబ్లిసిటీ జరుగుతుంది.. దానివల్ల అలా అనిపిస్తుందేమో. ఈరోజు మహేష్ భార్య నమ్రత పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ తన భార్యకు బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. ‘నేను ఎంతగానో ప్రేమించే నా ఇల్లాలికి, జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశాడు. 1972 జనవరి 22న జన్మించిన నమ్రత 1993లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్నారు. ఆ గుర్తింపుతో పలు హిందీ సినిమాల్లో నటించి అనంతరం మహేష్ బాబు సరసన ‘వంశీ’లో నటించారు. ఈ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి 2005, ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఇక ప్రస్తుతం మహేష్ అండ్ ఫ్యామిలీ ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌తో పాటు భార్య బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోడానికి అమెరికా వెళ్లారు.

More Related Stories