English   

మహేష్ బాబు గూఢచారిని రిజెక్ట్ చేశాడా..?

Mahesh-Babu
2018-08-04 13:03:35

ఏదైనా అంతే. రిలీజ్ అయ్యేంత వరకూ సినిమాలో దమ్మేంటో తెలియదు. అలాగే అది తీసిన వారి టాలెంట్ కూడా. ఈ విషయంలో మహేష్ బాబు ఓ బెస్ట్ ఆఫర్చునిటీ మిస్ చేసుకున్నాడనే వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ శుక్రవారం విడుదలైన గూఢచారి ముందు మహేష్ బాబుకే చెప్పిన కథట. కానీ అంతా కొత్తవారే కదా.. పైగా అడవి శేష్ చేసింది క్షణం(తనుగా సోలోగా ప్రయత్నం) ఒక్కటే. అదేదో క్యాజువల్ గా హిట్ అయింది.. అన్నీ అలా అవుతాయా అనుకున్నాడో లేక కొత్త దర్శకులను నమ్మొద్దనుకున్నాడో కానీ.. మొత్తంగా మహేష్ బాబు గూఢచారి కథను రిజెక్ట్ చేశాడు. అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది. సినిమాలో కథానాయకుడుని ‘ఏజెంట్ గోపి’ అంటారు. అయితే ఇదే పేరుతో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇలాంటి తరహా సినిమానే చేసి ఉన్నాడు. అందువల్ల ఆ ఇమేజ్ తనకూ ఇబ్బందిగా మారుతుందని.. లేదంటే తండ్రి రూట్ లో తనయుడు అంటూ కొత్త కథనాలు వడ్డిస్తారనే కారణం కూడా ఉందంటున్నారు. అయితే అడవి శేష్ చేసిన ఈ కథ ఇప్పుడు అద్భుతం అనే మాట తప్ప మరే మాటా వినిపించనంత గొప్ప పేరు తెచ్చుకుంది. 

 నిజానికి ఈ సినిమా మహేష్ బాబు చేసి ఉంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ రేంజ్ లో ఓ హాట్ ప్రాజెక్ట్ అయ్యి ఉండేది. అలాగే బడ్జెట్ కూడా ఇంకా పెరగడం.. రిచ్ గానూ కనిపించేది. బట్ ఇది ఖచ్చితంగా మహేష్ బాబు బ్యాడ్ లక్ అనే చెప్పాలి. కాకపోతే అతను ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేయడానికి ఓ కారణం అంటారు. కానీ ఇలాంటి సినిమాలు రావడం రేర్. ఆ రేర్ ఛాన్స్ నే బేర్ గా వదిలేసుకున్నాడు సూపర్ స్టార్. అయితే ఏ మాటకామాటే.. అడవి శేష్ ఎక్కడా మిస్టేక్ చేయలేదు. శేష్ రాసుకున్న దాన్ని స్పష్టంగా తెరపైకి తీసుకురాగలిగాడు దర్శకుడు. గూఢచారి లాంటి ప్రాజెక్ట్  ఈ బడ్జెట్ లో అంత హై క్వాలిటీలో టాలీవుడ్ లో ఎక్స్ పెక్ట్ చేయం. అలా ఎక్స్ పెక్ట్ చేయలేదు కాబట్టే గూఢచారి ఇంత సర్ ప్రైజ్ ఇచ్చాడు. 

More Related Stories