English   

మ‌హేశ్ ను ఏడిపించిన గూఢ‌చారి.. 

Mahesh-babu
2018-08-05 11:20:51

అదేంటి.. గూఢ‌చారి సెంటిమెంట్ సినిమా కాదే..! ఆ సినిమా ఏడ‌వాల్సిన సీన్స్ ఏమున్నాయ‌బ్బా అనుకుంటున్నారా..? అలాంటిదేం లేక‌పోవ‌చ్చు కానీ ఈ సినిమా చూసిన త‌ర్వాత మాత్రం క‌చ్చితంగా మ‌హేశ్ ఏడ్చే ఉంటాడు. దానికి కారణం కూడా లేక‌పోలేదు. ఎందుకంటే ఈ చిత్ర క‌థ ముందు మ‌హేశ్ ద‌గ్గ‌రికే వెళ్లింది. ఆయ‌న కాదన్నాడు. క‌థ‌లో ఏం లోపం క‌నిపించిందో తెలియ‌దు కానీ గూఢ‌చారి చేయ‌లేన‌ని చెప్పాడు. దాంతో ఈ క‌థ‌ను మెరుగులు దిద్ది త‌నే హీరోగా చేసాడు అడ‌విశేష్. కానీ తాను రిజెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందో చూడ్డానికి ప్ర‌త్యేకంగా షో వేయించుకుని మ‌రీ చూసాడు మ‌హేశ్. ఈ సినిమా చూసిన త‌ర్వాత క‌చ్చితంగా తాను చేసిన త‌ప్పేంటో మ‌హేశ్ కు అర్థ‌మైపోయి ఉంటుంది. 

100 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్.. స్టార్ టెక్నిక‌ల్ టీం.. మురుగ దాస్ లాంటి ద‌ర్శ‌కుడు క‌లిసి స్పైడ‌ర్ అంటూ డిజాస్ట‌ర్ ఇచ్చాడు. కానీ ప‌క్కా స్క్రీన్ ప్లేతో అడ‌విశేష్ కేవ‌లం 5 కోట్ల‌తో గూఢ‌చారి సినిమా చేసాడు. ఈ ఔట్ పుట్ చూసి చాలా బాగుంద‌ని మెచ్చుకున్నాడు మ‌హేశ్. మ‌రీ ముఖ్యంగా అడ‌విశేష్ తో పాటు 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ స్క్రీన్ పై క‌నిపించిన సుప్రియను కూడా మెచ్చుకున్నాడు సూప‌ర్ స్టార్. ఇన్నేళ్లు న‌ట‌న‌కు దూరంగా ఉన్నా కూడా ఆ గ్యాప్ తెలియ‌లేద‌ని మ‌హేశ్ అన్నాడ‌ని చెప్పింది సుప్రియ‌. మొత్తానికి గూఢ‌చారి చూసిన త‌ర్వాత క‌చ్చితంగా ఒక్క‌సారైనా మ‌హేశ్ మ‌న‌స్పూర్థిగా బాధ ప‌డుంటాడు. ఈ చిత్రం మిస్ అయినందుకు.. ఏంటి కాదంటారా..?

More Related Stories