English   

దీపావళికి మహేష్ మూవీ టీమ్ ఇచ్చే సర్ప్రైజ్ అదేనా

mb
2019-10-23 17:55:19

మహర్షి సినిమా హిట్ కొట్టడంతో మంచి ఊపు మీదున్న మహేష్ బాబు తన తాజా సినిమాగా సరిలేరు నీకెవ్వరు లో నటిస్తున్నాడు. హిట్ తప్ప ఫ్లాప్ అనేది ఎరుగని ఎంటర్టైనర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. మహేష్-అనిల్ కాంబినేషన్ తో పాటు దాదాపు పదిహేనేళ్ళ తర్వాత విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనుండడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే సినిమా షూట్ ప్రారంభ సమయంలో విజయశాంతి నటిస్తుందని అభిమానుల్లో ఆసక్తి పెంచిన చిత్ర బృందం ఇప్పటికి వరకు ఆమె ఏ పాత్రలో నటిస్తుందో అయితే చెప్పలేదు.

విజయశాంతి సెట్స్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు ముఖం పూర్తిగా కనిపించకుండా అద్దంలో కనిపించే ఆమె షేడ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకుమించి ఎలాంటి ఫొటోను ఇప్పటికి వరకు విడుదల చేయలేదు. ఆమెకి సంబంధించి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఆమె లుక్ చూస్తుంటే ఏదో టీచర్ లానో, లెక్చరర్ లానో ఉంది. అయితే దీపావళి సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తానని ప్రకటించిన ఈ సినిమా యూనిట్ ఆరోజున సినిమాలోని విజయశాంతి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగానే విజయశాంతి లుక్‌ రిలీజ్‌ చేస్తారా ? లేక మళ్ళీ మహేష్‌ లుక్కే రిలీజ్ చేస్తారా ? అనేది వేచి చూడాలి.

More Related Stories