English   

లొకేషన్ చేంజ్ చేసేసిన మహేష్ బాబు

mb
2019-10-20 19:32:55

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా మూవీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటించనున్న ఈ సినిమాలో కధ రీత్యా కర్నూల్ ఫ్యాక్షన్ ప్రస్తావన కూడా ఉండనుందట. ఈ మధ్యనే కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ ని రామోజీ ఫిలిం సిటీలో వేసి కొన్ని కీలక సీన్స్ షూటింగ్ కూడా జరిపారు.

అయితే ఇప్పుడు ఆ సెట్ లో పనైపోయిందట. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకరాలలో జరుగుతోంది. ఇక్కడ రెండున్నర కోట్ల రూపాయల ఖర్చుతో ఒక పెద్ద డూప్లెక్స్ సెట్ వేశారట. సినిమాలో ప్రకాష్ రాజ్ కు సంబంధించిన ఇంటిగా చూపించే ఈ సినిమాలో ప్రస్తుతం ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. ఈ ఫైట్ లో మహేష్ తో పాటు మరి కొందరు కీలక నటీనటులు పాల్గొంటున్నారని అంటున్నారు. నవంబర్ నెలాఖరు కల్లా షూట్ పూర్తి చేయాలనే డెడ్ లైన్ తో యూనిట్ పనిచేస్తోందట. ఎందుకంటే మొన్న బన్నీ సినిమాతో పోటాపోటీగా ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. అందుకే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ డిసెంబర్ లోనే పూర్తి చేసి సంక్రాంతికి ఒక రేంజ్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఎటూ మహేష్ కి కూడా నిర్మాణంలో భాగం ఉంది కాబట్టి ప్రమోషన్స్ ని కూడా ఒక రేంజ్ లో ప్లాన్ చేసిందట నమ్రత టీమ్.

 

More Related Stories