English   

సర్కారువారి పాటకు మహేష్ కండిషన్స్

Mahesh babu
2020-09-27 08:47:12

గీతాగోవిందం సినిమాతో విజయ్ దేవరకొండకు హిట్ ను అందించిన దర్శకుడు పరశురామ్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సర్కారు వారి పాట అని టైటిల్ ను పెట్టి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసారు. కాగా ఫస్ట్ లుక్ లో మహేష్ బాబు ఊరమాస్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మహేష్ బాబు మెడ పై ఉన్న రూపాయి బిళ్ళ టాటూ మరింత మాస్ లుక్ ను తీసుకువచ్చింది. దాంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. మరోవైపు విలన్ గా నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోను లైన్ లో పెడుతున్నట్టు టాక్ నడుస్తోంది. 

అంతేకాకుండా సినిమాలో మహేష్ బాబు అక్కగా విద్యాబాలన్ నటించనుంది. ఇదిలా ఉండగా మహేష్ బాబు ఈ సినిమాకు కొన్ని కండిషన్స్ పెట్టాడట. సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ ను చకచకా పూర్తిచేసిన మహేష్ బాబు ఈ సినిమాను కూడా త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు పరుశురామ్ తో చెప్పేసాడట. దాంతో సర్కారు వారి పాట త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని అభిమానుల ముందుకు రనున్నట్టు తెలుస్తోంది.మరోవైపు మహేష్ తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ నిర్ణయంతో బడ్జెట్ కూడా కొంత తగ్గుతుందని అంచనా వేస్తున్నారట. ఇక సర్కారు వారి పాట ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

More Related Stories