English   

అల్ల‌రోడి రుణం తీర్చుకుంటున్న మ‌హేశ్..

Mahesh-Babu
2018-06-16 11:55:50

అవును.. ఇప్పుడు అల్ల‌రి న‌రేష్ కు రుణ‌ప‌డిపోయాడు మ‌హేశ్ బాబు. అస‌లే పండుగాడు ఎవ‌రి రుణం ఉంచుకోడు. ఎవ‌రి బాకీ అప్పుడే.. ఎవరి లెక్క‌లు అక్క‌డే. అందుకే ఇప్పుడు అల్ల‌రోడి బాకీ కూడా తీర్చుకుంటున్నాడు ఈ హీరో. ఇంత‌కీ ఎక్క‌డ ఎప్పుడు ఎలా న‌రేష్ కు మ‌హేశ్ బాకీ ప‌డ్డాడో అనుకుంటున్నారా..? ఏం లేదండి.. ఇప్పుడు మ‌హేశ్ బాబు 25వ సినిమా ఉంది క‌దా.. అదే ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్ల‌తో క‌మిట‌య్యాడు క‌దా.. అందులో అల్ల‌రోడు మ‌హేశ్ బాబు స్నేహితుడిగా న‌టిస్తున్నాడు. త‌న‌కు కూడా కాస్త ఇమేజ్ పెట్టుకుని.. మార్కెట్ ఉండి కూడా మ‌హేశ్ కోసం ఫ్రెండ్ అయ్యాడు న‌రేష్. అందుకే ఆ రుణాన్ని కాస్త ఇప్పుడు తీర్చుకోబోతున్నాడు సూపర్ స్టార్. న‌రేష్ ప్ర‌స్తుతం భీమినేని ద‌ర్శ‌క‌త్వంలో సిల్లీఫెల్లోస్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ కు మ‌హేశ్ రానున్నాడు. దీనికి ఒక్క‌టే కార‌ణం.. అల్ల‌రి న‌రేష్ హీరో కావ‌డం. ఆయ‌న త‌న సినిమాలో కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టిస్తుండ‌టం. అందుకే ఈ చిత్ర ప్రీ రిలీజ్ కు వ‌చ్చి సిల్లీఫెల్లోస్ కు త‌న వంతు సాయం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో సునీల్ కూడా మ‌రో హీరోగా న‌టించాడు. ఈ ఇద్ద‌రికి ఇప్పుడు విజ‌యం అవ‌స‌రం. మ‌రి మ‌హేశ్ సాయంతో న‌రేష్ ఎంత‌వ‌ర‌కు మాయ చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories