English   

 సిట్టిబాబుకు ఆయ‌నే మొగుడు..!

mahesh-Ram-charan
2018-04-17 07:39:16

ఇదివ‌ర‌కు ఓ సినిమా రికార్డ్ సృష్టిస్తే దాన్ని తిర‌గ‌రాయ‌డానికి ఏళ్ల‌కేళ్లు ప‌ట్టేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఓ సినిమా వ‌చ్చిందే ఆల‌స్యం.. మ‌రో సినిమా వ‌చ్చి రికార్డులు తిర‌గ‌రాస్తుంది. కాక‌పోతే కంటెంట్ బాగుండాలంతే. అది ఉంటే రికార్డులు ఈజీగా వ‌చ్చేస్తున్నాయి. ఇప్పుడు యుఎస్ లో రంగ‌స్థ‌లం దూకుడు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ చిత్రం అక్క‌డ ఏకంగా 3.5 మిలియ‌న్ వైపు ప‌రుగులు పెడుతుంది. అయితే సిట్టి బాబు రికార్డులు అక్క‌డ ఎంత‌కాలం ఉంటాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారిందిప్పుడు. ఎందుకంటే శ్రీ‌మంతుడు రికార్డులన్నీ తిర‌గ‌రాయ‌డానికి నాన్ బాహుబ‌లికి మూడేళ్లు ప‌ట్టింది. ఖైదీ నెం.150 సినిమా కూడా దాన్ని దాట‌లేదు. ఇప్పుడు రంగ‌స్థ‌లం ర‌చ్చ చేస్తుంది. ఇదే స‌మ‌యంలో  భ‌ర‌త్ అనే నేను భారీ స్థాయిలో విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాకు ఎప్రిల్ 19 రాత్రే 2 వేల ప్రీమియ‌ర్ షోస్ వేస్తున్నారు. దీనితోనే 2 మిలియ‌న్ మార్క్ అందుకో వాల‌ని చూస్తున్నాడు మ‌హేశ్. ఒక‌వేళ సినిమాకు కానీ పాజిటివ్ టాక్ వ‌చ్చిందంటే ఈజీగా మూడు రోజుల్లోనే 3 మిలియ‌న్ మార్క్ అందుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాక‌పోవ‌చ్చు. ఎందుకంటే అక్క‌డ మ‌హేశ్ బాబుకు ఉన్న ఇమేజ్.. మార్కెట్ అలాంటిది మ‌రి. స్పైడ‌ర్ లాంటి డిజాస్ట‌ర్ సినిమానే 1.5 మిలియ‌న్ అందుకుంది. దాంతో హిట్ సినిమా వ‌స్తే 3.5 మిలియ‌న్ క్రాస్ చేయ‌డం పెద్ద లెక్కేం కాదు. దాంతో సిట్టిబాబు రికార్డుల‌కు కాలం చెల్ల‌డానికి ఎంతో కాలం ప‌ట్టేలా లేదిప్పుడు.

More Related Stories