English   

మొదలైన మహేష్ బాబు బర్త్ డే వేడుకలు..

Mahesh Babu
2020-08-09 08:15:55

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదు. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తన పుట్టిన రోజు వేడుకలు ఎక్కడ జరపొద్దు అంటూ అభిమానులను కోరాడు సూపర్ స్టార్. ఆగస్టు 9 తో 46 వసంతాలు పూర్తిచేసుకుని 47 లోకి అడుగు పెడుతున్నాడు మహేష్ బాబు.  మహేష్ బాబు చెప్పినట్లు బయట సమూహాలు ఏర్పాటు చేయడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తమ హీరో సత్తా చూపించడానికి సిద్ధమైపోయారు అభిమానులు. కొడితే రికార్డులన్నీ తమ హీరో పేరు మీదకి వచ్చేయాలి అన్నట్లు కసిమీద వున్నారు ఫ్యాన్స్. అందుకే ఆగస్టు 9 రాత్రి 12 గంటలకు మొదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే వేడుకలు మరుసటి రోజు రాత్రి 12 గంటల వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ ట్విటర్ లో నంబర్ ఒన్ గా నిలవగా.. ఇప్పుడు బర్త్ డే విషెస్ కూడా దానికి మించి ట్రెండ్ చేయాలని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. 24 గంటల పాటు మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో ఇది యజ్ఞంలా చేస్తున్నారు. మరి ఇది ఎంతగా ట్రెండ్ కానుందో చూడాలి.

More Related Stories