English   

మహేష్ పట్టు.. బన్నీ బెట్టు

allu arjun and mahesh babu

ఏప్రిల్ 26.. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత హాట్ డేట్ అయిందిది. ఆ డేట్ తో ముడిపడి ఇద్దరు స్టార్ హీరోల ఇగో కూడా ఉంది. లేదంటే ఆ స్టార్ హీరోల కాన్ఫిడెన్స్ కూడా ముడిపడి ఉందనుకోవచ్చు. మహేష్ బాబు, అల్లు అర్జున్.. టాలీవుడ్ లో హాటెస్ట్ స్టార్ వార్ కు దారి తీశారు. అందుకు కారణం ఏప్రిల్ 26. ఈ డేట్ తోనే ఈ ఇద్దరూ వార్ లో సై అంటే సై అనుకున్నారు. ఇక ఈ అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరుసూర్య నా ఇల్లు ఇండియాలో నటిస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈ మూవీ పూర్తి కావచ్చింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు. బన్నీ ఫస్ట్ టైమ్ ఆర్మీ మ్యాన్ గా కనిపించబోతున్నాడీ మూవీతో. ఆల్రెడీ రిలీజ్ చేసిన రెండు పాటలు ఆడియన్స్ కు బాగా ఎక్కేశాయి. నిజానికి సినిమా మొదలైనప్పుడే ఏప్రిల్ 27న విడుదల చేసేలా ప్లాన్ చేసుకుందీ మూవీ టీమ్. అదే రోజు రజినీకాంత్ 2.0 కూడా ఉంది. దీంతో రిలీజ్ డేట్ లో మార్పులుండొచ్చు అనుకున్నారు. కానీ రజినీ తప్పుకున్నాడు. కట్ చేస్తే వెంటనే ఆ డేట్ ను మహేష్ బాబు సినిమాతో లాక్ చేశారు.

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న భరత్ అనే నేను కూడా ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది టీమ్. దీంతో ముందు ఆ డేట్ లో వస్తామని చెప్పింది తాము కాబట్టి.. తామూ తగ్గేది లేదనుకుంది బన్నీ మూవీ టీమ్. ఇటు మహేష్ అండ్ టీమ్ కూడా అదే పట్టుతో ఉంది. దీంతో బన్నీ ఒకడుగు ముందుకేసి ఏప్రిల్ 26 అన్నాడు. వెంటనే మహేష్ కూడా నేనూ ఆ రోజే వస్తా అన్నాడు. అటు ఏప్రిల్ 27న మళ్లీ రజినీకాంత్ కాలా కూడా ఉంది. ఈ ఇద్దరి వార్ లో అసలు ఆ సినిమాను పట్టించుకున్నవారే లేరు. అయితే రీసెంట్ గా ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరిగాయట..బన్నీని రిలీజ్ డేట్ మార్చుకోమని కొందరు ‘సినీపెద్దలు’ సలహాలిచ్చారట. అందుకు బన్నీ ససేమిరా అన్నాడని టాక్. తానేమీ ఏ స్టార్ కంటే తక్కువ కాదని.. అవసరమైతే వారినే తప్పుకోమని కూడా చెప్పాడట. ఎవరి రేంజ్ వారికి ఉంటుందని.. తన రేంజ్ తనకుందని గట్టిగానే బదులిచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అటు మహేష్ బాబు మాత్రం తన డేట్ లో మార్పుండదని స్ట్రాంగ్ గా చెప్పాడట. దీంతో అందరూ కలిసి బన్నీనే చల్లబరిచే ప్రయత్నం చేస్తే.. మే 4న వచ్చేందుకు సముఖుంగా ఉన్నట్టు  నా పేరు సూర్య టీమ్ ఉందని టాలీవుడ్ టాక్. ఏదేమైనా ఇద్దరు టాప్ స్టార్స్ ఇలా డేట్ కోసం కొట్టుకోవడం ఈ మధ్య కాలంలో ఇదే చూస్తున్నాం. మరి బన్నీ నిజంగానే మే 4కు వెళతాడా లేక వార్ లో నిలబడతాడా అనేది చూడాలి..

More Related Stories