English   

ఆ సినిమా మహేష్ విజయ్ కాంబోలో తెరకెక్కాల్సింది...కానీ 

 Mahesh Babu
2020-06-05 11:13:54

ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్ సినిమాలకి డిమాండ్ ఎక్కువయింది. కాస్త బడ్జెట్ ఎక్కువయినా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తుండడంతో ఎక్కువ మంది దర్శక నిర్మాతలు ఈ తరహా సినిమాల మీదనే ద్రుష్టి పెడుతున్నారు. ఇక రెండు భాషల స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారంటే ఆ సినిమా రేంజ్ ఇక వేరే లెవల్ అని చెప్పచ్చు. నిజానికి తెలుగులో స్టార్ హీరో మహేష్ బాబు.. తమిళ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే అది ప్రచారం వరకే పరిమితం అయిపొయింది. అయితే ఈ విషయాన్ని ఈమధ్య మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ధన నిజమేనని ధృవీకరించారు. ధన మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా పని చేసినప్పుడు ఈ సినిమా ప్లానింగ్ జరిగిందని, మహేష్.. విజయ్ ప్రధాన పాత్రలలో మణి 'పొన్నియన్ సెల్వన్' సినిమా ప్లాన్ చేశారట. అయితే ఆ కాంబినేషన్ ఎందుకో కానీ వర్క్ అవుట్ కాలేదట. ఇక ప్రస్తుతం మణిరత్నం ఈ సినిమాని విక్రమ్, కార్తి, జయం రవి హీరోలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. డేట్స్ కుదరలేదో, లేక ఇంకేం కారణాలో కానీ సౌత్ ఆడియన్స్ ఒక మంచి కాంబినేషన్ మిస్ అయినట్టే.  

More Related Stories