English   

మహేష్ బాబు కు జరిమానా

 Mahesh Babu
2020-08-10 08:40:04

పుట్టిన రోజు నాడే మహేష్ బాబుకు షాకివ్వడానికి రెడీ అయ్యారు మునిసిపల్ అధికారులు. అదేంటి పుట్టిన రోజు నాడు షాక్ అనుకుంటున్నారా ? నిజానికి ఈరోజు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాడు. ఆ మొక్కలు నాటిన విషయాన్ని తన ట్విట్టర్ లో షేర్ చేసాడు. అంతే కాక మొక్కలు నాటడమే కాక మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరాడు కూడా. అయితే ఈ మొక్కలు నాటే సమయంలో ఆయన మాస్క్ ధరించలేదు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించలేదని చెబుతూ ఆయనకు జరిమానా విధించేందుకు అధికారులు సిద్దం అయినట్టు చెబుతున్నారు. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక కరోనా వేగంగా విస్తరిస్తున్న కారణంగా సామూహిక వేడుకలు జరుపుకోవద్దని.. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తున్న యుద్ధంలో సురక్షితంగా ఉండడం అన్నింటికన్నా ముఖ్యమని.. నా పుట్టినరోజున అభిమానులంతా వేడుకలకి దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని ఇంతకు ముందే మహేష్ బాబు కోరాడు. 

More Related Stories