English   

మహేష్ బాబుకు ఛాలెంజ్

mahesh-bharat-ane-nenu

ఇండస్ట్రీలో ఏ రికార్డూ శాశ్వతం కాదు. కొన్ని రికార్డ్స్ బద్ధలు కావడానికి కొంత ఎక్కువ టైమ్ పట్టవచ్చు. మరికొన్ని చాలా త్వరగానే క్లియర్ కావచ్చు. అయితే ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్స్ వస్తూనే ఉన్నప్పుడు ఆ తర్వాత వచ్చే సినిమాలకు అవి ఛాలెంజ్ విసిరినట్టుగానే భావించాలి. అలా ఇప్పుడు రగస్థలం కలెక్షన్ల రికార్డుతో రామ్ చరణ్.. మహేష్ బాబుకు ఓ కొత్త ఛాలెంజ్ విసిరాడు. అయితే ఇది మహేష్ కష్టమా కాదా అనే విషయం పక్కనబెడితే ఈ ఛాలెంజ్ తో మహేష్ బాబు, చరణ్ రికార్డ్ ను ఎన్ని రోజులు ఉంచుతాడు అనే విషయం తేలుతుంది. 

లేటెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే 100కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్లు మావే అని ఏకంగా నిర్మాతలే ప్రకటించుకున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు బాహుబలిని పక్కన బెడితే టాలీవుడ్ హయ్యొస్ట్ గ్రాసర్ రంగస్థలమే. ఇది ఇక్కడే కాదు.. ఓవర్శీస్ లో కూడా ఓ రేంజ్ లో కలెక్షన్లు కురిపిస్తోంది. సో.. ఈ రికార్డ్ ను బ్రేక్ చేసేది ఎవరు అనే ప్రశ్న వస్తే ఇమ్మీడియొట్ గా కనిపిస్తోంది మహేష్ బాబు మాత్రమే. 

మహేష్ బాబు, కొరటాల శివ కాంబోలో వస్తోన్న భరత్ అనేనేను ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఇది పొలిటికల్ డ్రామా. ఇప్పటి వరకూ మహేష్ చేయనిది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా మహేష్ బాబు గత రెండు సినిమాలూ దెబ్బకొట్టాయి. అవి కూడా ఓ రేంజ్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు. ఈ నేపథ్యంలో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా కాబట్టి అంచనాలు బాగా ఉన్నాయి. ఇక ఓవర్శీస్ లో మహేష్ బాబు కింగ్. కొరటాలకూ మంచి మార్కెట్ ఉందక్కడ.. ఈ నేపథ్యంలో భరత్ కలెక్షన్లు బాగా ఉంటాయనుకోవచ్చు. కానీ సినిమా బావుంటేనే అనేది క్యాప్షన్ అనుకోండి. 

ఇక విషయం ఏంటంటే.. ఇప్పుడు రంగస్థలం కలెక్షన్లతో రామ్ చరణ్ విసిరిన ఛాలెంజ్ ను మహేష్ బాబు స్వీకరిస్తాడా అనేది. లేదా ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తాడా అని. ఒక రకంగా భరత్ అనేనేనుకు సంబంధించి ఇప్పటి వరకూ వచ్చిన బజ్ సరిపోదు. పాటలు, టీజర్ ఇవేవీ పెద్దగా కిక్ ఇవ్వలేదు. మరోవైపు ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన ఏ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా కూడా ఆడలేదు. ఆ సెంటిమెంట్ ను ఇప్పుడు భరత్ బ్రేక్ చేయాలి. అప్పుడే కలెక్షన్ కింగ్ అనిపించుకుంటాడు.. లేదంటే సినిమా బావున్నా పొలిటికల్ లీడర్ లానే మిగిలిపోతాడు. బట్ ఒకవేళ మహేష్ బాబు కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తే రామ్ చరణ్ కు తన రికార్డ్ ఆనందం ఎక్కువ కాలం నిలవదనే చెప్పాలి. 

More Related Stories