English   

మ‌హేష్ నెక్స్ట్ సినిమా అత‌డితోనేనా

Mahesh Babu
2021-04-08 12:13:33

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 

అయితే ఇప్పటికే పలువురు డైరెక్టర్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రిన్స్ ఈ సినిమా తరువాత  ఏ దర్శకుడి సినిమాలో నటిస్తాడన్నది ఆసక్తిగా మారింది. కాగా తాజా ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం సర్కారు వారి పాట పూర్తి చేసుకున్న తరువాత  మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడట. 

ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ కు కథ చెప్పగా బాగా నచ్చిందంట. ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమా వచ్చాయి. వాటిలో ఒకటి సూపర్ హిట్ కాగా మారో సినిమా హిట్ కాకపోయినా క్లాసిక్ కల్ట్ గా నిలిచింది. అంతే కాకుండా మహేష్ బాబు రాజమౌలి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతునట్టు తెలిసిందే. అయితే ఈ సినిమాకు ముందు కచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యం తోనే మహేష్ త్రివిక్రమ్ ను ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఇక చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి.

More Related Stories