English   

భ‌ర‌త్ ప‌ని ముగించుకుంటున్నాడు..

Mahesh-ban
2018-03-19 11:54:27

వంశీ పైడిప‌ల్లికి సెల‌వులు పూర్తైపోతున్నాయి. ఎవ‌రికైనా నెల.. రెండు నెల‌లు హాలీడేస్ ఉంటాయి. కానీ ఈ ద‌ర్శ‌కుడు మాత్రం ఎప్పుడూ తీసుకున్నా మినిమ‌మ్ రెండేళ్లు తీసుకుంటాడు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈయ‌న గ‌త సినిమా ఊపిరి విడుద‌లై రెండేళ్లు దాటేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా మొద‌లుపెట్ట‌లేదు వంశీ. ఇప్పుడు మ‌హేశ్ బాబు సినిమాతో బిజీ కానున్నాడు. మ‌రోవైపు మ‌హేశ్ కూడా భ‌ర‌త్ అనే నేనును పూర్తి చేయ‌బోతున్నాడు. ఈచిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే ఓ గుడి సెట్ లో జ‌రుగుతుంది. అక్క‌డే 100 మంది డాన్స‌ర్లు.. 1000 మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల మ‌ధ్య‌లో పాట‌ను చిత్రీక‌రిస్తున్నాడు రాజుసుంద‌రం. మార్చ్ 25 నుంచి స్పెయిన్ కూడా వెళ్ల‌బోతున్నారు భ‌ర‌త్ అనే నేను టీం. ఈ షెడ్యూల్ తోనే షూటింగ్ అంతా పూర్తి కానుంది. ఇది పూర్తైన వెంట‌నే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వంశీ సినిమా మొద‌లు పెట్ట‌బోతున్నాడు మ‌హేశ్ బాబు. ఇప్ప‌టికే ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కూడా మొద‌లైపోయింది. ఈ చిత్రం జ‌ర్న‌లిజం బ్యాక్ డ్రాప్ లో వ‌స్తుంద‌ని తెలుస్తుంది. ఇందులో అల్ల‌రి న‌రేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. దిల్ రాజు, అశ్వినీద‌త్ నిర్మాత‌లు. మొత్తానికి రెండేళ్ళ త‌ర్వాత మ‌ళ్ళీ వంశీ పైడిప‌ల్లిని బిజీగా మార్చ‌బోతున్నాడు మ‌హేశ్ బాబు.అన్న‌ట్లు ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టించ‌బోతుంది.

More Related Stories