English   

అప్పుడూ ఇప్పుడూ సూపర్ స్టారే.. ముఖ్యమంత్రి

mahesh-babu
2018-04-18 09:14:56

సూపర్ స్టార్ అనేపేరును ఇంటిపేరుగా చేసుకున్న ఏకైక స్టార్ కృష్ణ. ఆయన వారసుడుగా వచ్చిన మహేష్ బాబు కూడా ఆ సూపర్ స్టార్ అనే బిరుదుకు అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు కూడా. ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అనేనేను సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అతడు ముఖ్యమంత్రిగా నటించాడు. అయితే ఇప్పటికి 34యేళ్ల క్రితమే ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు ముఖ్యమంత్రిగా నటించారు. విశేషం ఏంటంటే ఆ సినిమా పేరు కూడా ముఖ్యమంత్రే. కృష్ణ సరసన అంబిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకురాలు. టి శ్రీనివాసరెడ్డి నిర్మించాడు. 1984లో విడుదలైన ముఖ్యమంత్రి మంచి విజయం కూడా సాధించింది. అప్పట్లోనే ఫస్ట్ వీక్ లోనే 52లక్షల 13వేలకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. అప్పటికే పొలిటికల్ గా కృష్ణగారు యాక్టివ్ గా ఉన్నారు. ఈ సినిమా తీయడానికి ఇది కూడా ఒక కారణం. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన తనయుడు మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించబోతుండటం విశేషం. భరత్ అనేనేనులో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు అని తెలిసిన దగ్గర్నుంచీ చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే అప్పట్లో కృష్ణలా ఇప్పుడు మహేష్ బాబు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే తనకు పాలిటిక్స్ అంటేనే పడవు అని చెబుతాడు. దాన్ని బట్టి ఆయన స్వేచ్ఛగా ఏ విధానంపై అయినా సెటైర్ వేసే అవకాశం ఉంది. మొత్తంగా ఒరిజినల్ పాలిటిక్స్ లో తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకూ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ సినిమాలో కూడా అలా జరగబోతుండటం నిజంగా అరుదైన విశేషమే.

More Related Stories