English   

మ‌హేశ్.. అల్లు అర్జున్.. ఎందుకో ఈ పంథం..? 

Mahesh-allu-arjun
2018-02-14 12:30:38

తెలిసి చేసినా.. తెలియ‌క చేసినా త‌ప్పు త‌ప్పే. ఒక్క‌సారి త‌ప్పు జ‌రిగిన త‌ర్వాత చేసేదేం ఉండ‌దు. చూస్తూ బాధ ప‌డ‌టం త‌ప్ప‌. కానీ అదే త‌ప్పు జ‌ర‌గ‌క ముందు ఆప‌డానికి ఎన్ని మార్గాలైనా ఉంటాయి. కానీ దాని వైపుగా ఆలోచించ‌డం లేదు ఇప్పుడు మ‌న స్టార్ హీరోలు. త‌ప్పు జ‌ర‌గాల్సిందే అంటున్నారు. అది కోప‌మో.. పంథ‌మో అర్థం కావ‌డం లేదు. మ‌హేశ్, బ‌న్నీ ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ఇద్ద‌రూ ఒకేరోజు వ‌స్తున్నారు. మ‌ళ్లీ ఇద్ద‌రూ త‌మ సినిమాల విడుద‌ల తేదీ మార్చుకున్నారు. కానీ మ‌ళ్లీ తిరిగి ఒకేరోజు ఇద్ద‌రూ త‌మ రిలీజ్ డేట్స్ క‌న్ఫ‌ర్మ్ చేస్తున్నారు. ఎప్రిల్ 27 నుంచి ఒక్క‌రోజు ముందుకు వ‌చ్చారు ఈ ఇద్ద‌రూ. ఇప్పుడు ఎప్రిల్ 26న బ‌న్నీ, మ‌హేశ్ సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చింది. ఎవ‌రికి వాళ్ళే త‌మ సినిమా ఎప్రిల్ 26న వ‌స్తుంద‌ని అనౌన్స్ చేసారు. 

అల్లుఅర్జున్ ఎప్ప‌ట్నుంచో స‌మ్మ‌ర్ రేస్ లో ఉన్నాడు. నిజానికి ఎప్రిల్ 27పై ముందు ఖ‌ర్చీఫ్ వేసింది కూడా ఈయ‌నే. ఇప్పుడు మ‌ళ్లీ డేట్ ముందుగా మార్చుకున్నది కూడా బ‌న్నీనే. ఇప్పుడు మ‌హేశ్ సినిమా కూడా అదేరోజు రానున్న‌ట్లు ప్ర‌క‌టించాడు నిర్మాత దాన‌య్య. సంక్రాంతికి రావాల‌నుకున్న మ‌హేశ్ భ‌ర‌త్ అను నేను స‌మ్మ‌ర్ కు వాయిదా ప‌డింది. స్పైడ‌ర్ కార‌ణంగా ఆల‌స్యం కావ‌డంతో ఈ చిత్రాన్ని వేస‌వికి వాయిదా వేసారు. బ‌న్నీతో పాటే.. అంటే ఎప్రిల్ 26న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే తాము వెన‌క్కి త‌గ్గేది లేద‌ని నా పేరు సూర్య నిర్మాత బ‌న్నీ వాసు తెలిపాడు. ఇక భ‌ర‌త్ అను నేను టీం కూడా వెన‌క్కి త‌గ్గేలా క‌నిపించ‌ట్లేదు. 

ఇవ‌న్నీ ఇలా ఉంటే ర‌జినీ కూడా ఇప్పుడు స‌మ్మ‌ర్ లోకే స‌డ‌న్ ఎంట్రీ ఇచ్చాడు. ఈయ‌న న‌టిస్తోన్న కాలా ఎప్రిల్ 27న విడుద‌ల కానుంది. అఫీషియ‌ల్ గా పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేసాడు నిర్మాత ధ‌నుష్. ఇప్పుడు మ‌హేశ్, బ‌న్నీ క‌లిసి ర‌జినీకాంత్ కు సోలో డేట్ ఇచ్చేసారు. కాలా ఒక‌రోజు ఆల‌స్యంగా వ‌స్తుంటే.. మ‌న హీరోలు మాత్రం ముందు రోజు వ‌స్తున్నారు. దానివ‌ల్ల లాభం కూడా లేక‌పోలేదు. ముందు విడుద‌లైన సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌స్తే అది అలాగే కొన‌సాగుతుంది. కానీ తేడా వ‌స్తే మాత్రం కాలా పండ‌గ చేసుకోవ‌డం ఖాయం. ఎందుకంటే అక్క‌డున్న‌ది సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్. గ‌తంలో రోబో దెబ్బ‌కు ఖ‌లేజాకు బ్యాండ్ ప‌డింది. ఇప్పుడు కూడా మ‌హేశ్, బ‌న్నీకి పోటీగా వ‌స్తున్నాడు ర‌జినీ. మ‌రి ఈ త్రిముఖ పోరు ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories