English   

మ‌హేశ్-బ‌న్నీ మ‌ధ్య‌లో ర‌జినీ..

bharathanenenu and kaala and naperusurya

భ‌లే కుదిరింది క‌దా కాంబినేష‌న్..! అటు నువ్వే ఇటు నువ్వే అన్న‌ట్లు.. మ‌హేశ్-బ‌న్నీ మ‌ధ్య‌లో ర‌జినీ భ‌లే ఇరుక్కుపోయాడు. ఇద్ద‌రు కూర్చుని మాట్లాడుకుంటే ఇప్పుడు మూడో వాడు పండ‌గ చేసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది ఇండ‌స్ట్రీలో. ఎప్రిల్ 26 యుద్ధం గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఒకేరోజు బ‌న్నీ, మ‌హేశ్ రావ‌డానికి చాలా రోజుల నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. ఐతే వీళ్ల మ‌ధ్య‌లోకి దిల్ రాజు వ‌చ్చాడు. దాంతో విష‌యం చాలా సింపుల్ గా ప‌రిష్కారం అయిపోయింది. ఎప్రిల్ 20కి మ‌హేశ్.. మే 4కి బ‌న్నీ వెళ్లాడు. ఈ ఇద్ద‌రి గ్యాప్ లోకి ర‌జినీకాంత్ వ‌చ్చేసాడు. ఎంత‌సేపూ మ‌హేశ్, బ‌న్నీ అటూ ఇటూ క‌దులుతున్నారు కానీ ర‌జినీ మాత్రం ముందు నుంచీ అక్క‌డే తిష్ట వేసుకుని కూర్చున్నాడు. ఇప్పటికీ ఇదే జ‌రుగుతుంది.

ఎప్రిల్ 27న కాలా రానుంది. ఇది ఎప్పుడో ఫిక్స్ చేసాడు నిర్మాత ధ‌నుష్. ఓ త‌మిళ సినిమా కోసం ఇప్పుడు ఇద్ద‌రు తెలుగు హీరోలు కొట్టుకుని ప‌క్క‌కు వెళ్లిపోయిన‌ట్లు ఉంది ప‌రిస్థితి. ఏం చేస్తాం.. ఎంతైనా అక్క‌డున్న‌ది ఆల్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ క‌దా.. ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వ‌క త‌ప్ప‌దు. సింపుల్ గా ఓ చోట కూర్చుని మాట్లాడుకుని.. దిల్ రాజు అటు భ‌ర‌త్ అనే నేను.. ఇటు నా పేరు సూర్య నిర్మాత‌ల మ‌ధ్య సంధి కుదిర్చాడు. దాంతో మూడు వారాల గ్యాప్ లో మూడు భారీ సినిమాలు వ‌స్తున్నాయి. ఇది కూడా అంద‌రికీ మంచిదే. మూడు సినిమాలు క‌చ్చితంగా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించేవే. టాక్ కాస్త తేడాగా వ‌చ్చినా తొలివారంలోనే మ్యాగ్జిమ‌మ్ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డానికి యూజ్ అవుతుంది. మొత్తానికి చూడాలిక‌.. ఈ మూడు సినిమాల భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories