English   

మహేష్ , బన్నీ వార్ ఆగిపోయింది...

allu arjun and mahesh babu
2018-02-22 17:05:09

టాలీవుడ్ లో ఈ మధ్య మొదలైన హాట్ స్టార్ వార్ కు ఫుల్ స్టాప్ పడింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ ల మధ్య వచ్చిన డేట్ క్లాష్ క్లియర్ అయిపోయింది. ఇద్దరూ కలిసి..ఇద్దరు గొడవపడితే మూడో వారికి లాభం అన్నట్టుగా..  తెలుగులో ఓ సామెతను నిజం చేసేశారు. యస్.. ఈ ఇద్దరూ వస్తామని గొడవపడ్డ డేట్ కు ఇద్దరూ రాకుండా సైడ్ అయిపోయి రజినీకాంత్ కు రూట్ క్లియర్ చేశారు. ఏప్రిల్ 27 లేదా 26.. ఈ మధ్య టాలీవుడ్ ను ఉలిక్కిపడేలా చేసిన డేట్. ఇదే రోజు మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరూ వద్దామనుకోవడమే ఇందుకు కారణం. మహేష్ బాబు భరత్ అనే నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలు ఒకే రోజు విడుదల చేస్తామని ప్రకటించారీ ఇద్దరూ. తర్వాత ఎవరేం చెప్పినా వినకుండా బెట్టు చేశారు. కానీ అలా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు వస్తే ఓపెనింగ్స్ పోతాయి. డే వన్ కలెక్షన్లూ తగ్గుతాయి. దీంతో వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగారు. తెలుగు ఫిలిమ్ చాంబర్ అధ్యక్షుడు జెమిని కిరణ్ నేతృత్వంలో ఈ రెండు సినిమాల మధ్య రాజీ కుదిర్చేశారు. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్స్ కూడా మరికొన్ని గంటల్లోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 

మహేష్ బాబు, అల్లు అర్జున్ లలో బన్నీ ముందుకు వస్తాడనుకున్నారు. కానీ మహేష్ వచ్చాడు. భరత్ అనే నేను ఏప్రిల్ 20నే వస్తోంది. అలాగే అల్లు అర్జున్ మే 4కు షిఫ్ట్ అయిపోయాడు. దీంతో నిన్నటి వరకూ ఈ రెండు సినిమాల మధ్య పడి నలిగిపోతుందనుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కు రూట్ క్లియర్ చేసినట్టైంది. ఆయన లేటెస్ట్ మూవీ కాలా ఏప్రిల్ 27న ఖచ్చితంగా వస్తుంది. పాపం నిన్నటి వరకూ ఈ సినిమాల మధ్య ఇదెవరు చూస్తారనుకున్నారేమో.. ఎవరూ కొనలేదీ మూవీని. కానీ ఇప్పుడు మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే రోజు మరెవరైనా వచ్చినా సూపర్ స్టార ముందు నిలవడం కష్టమే.

మొత్తానికి ఈ హాట్ వార్ కు ఫుల్ స్టాపెట్టడంతో ఫిలిమ్ చాంబర్ చొరవను అభినందించాల్సిందే. అయితే ఏమాటకామాటే.. ఇలాంటి వార్ జరిగినప్పుడే ఏ స్టార్ హీరో ఖలేజా ఏంటనేది ఒరిజనల్ గా తేలుతుంది. కానీ దీనికంటే ముందు ఆ సినిమాలు బతకడం ఇంపార్టెంట్ కాబట్టే ఈ రాజీ చర్యలు. సో.. ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించిన గొడవ ముగిసిపోయినట్టే. ఇక ఏప్రిల్ 20న రాబోతోన్న భరత్ అనే నేనుకోసం మహేష్ ఫ్యాన్స్, మే 4న రాబోతోన్న బన్నీ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా కోసం అతని ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే..

More Related Stories