English   

పొలిటిక‌ల్ హీట్ పెంచుతున్న మ‌హేశ్..

koratala  siva and mahesh babu

నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేశ్ బాబుకు రాజ‌కీయాలంటే ఏంటో తెలియ‌దు. పాలిటిక్స్ అనే ప‌దం వినిపిస్తే చాలు చాలా దూరం వెళ్లిపోతుంటాడు ఈ సూప‌ర్ స్టార్. అలాంటి హీరోతో ఇప్పుడు ప‌క్కా పొలిటిక‌ల్ మూవీ చేస్తున్నాడు కొర‌టాల శివ‌. భ‌ర‌త్ అనే నేను ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ చిత్ర ఫ‌స్ట్ విజ‌న్ అంటే టీజ‌ర్ మార్చ్ 6న విడుద‌ల కానుంది. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచ‌నాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు అద్దం ప‌ట్టేలా ఈ చిత్రం ఉంటుంద‌ని.. ఇందులో రాజ‌కీయ వ్యంగ్యాస్త్రాలు కూడా చాలానే ఉంటాయ‌ని తెలుస్తుంది. అస‌లే కొర‌టాల పెన్ను ప‌వ‌ర్ చాలా ప‌వ‌ర్ ఫుల్. ఇక ఆయ‌న‌కు మ‌హేశ్ కూడా తోడైతే ఇంక అంతే. అసెంబ్లీ హోరెత్తిపోవ‌డం ఖాయం. ఇప్పుడు ఇదే జ‌ర‌గ‌బోతుంద‌ని తెలుస్తుంది.

రోమ్ లో ఉన్న‌పుడు రోమ‌న్ లా ఉండాలంటారు. ఇప్పుడు మ‌హేశ్ ఇదే చేస్తున్నాడు. ఆయ‌న చేస్తోన్న సినిమాను బ‌ట్టే ఆయ‌న క‌ద‌లిక‌లు కూడా ఉన్నాయిప్పుడు. అప్ప‌ట్లో ఎన్టీఆర్ దేవుడి సినిమా చేస్తున్న‌పుడు నాన్ వెజ్ అస్స‌లు ముట్టుకునేవాడు కాదంట‌.. ఒంటిపూట భోజ‌నం కూడా చేసేవాడంట‌.. ఇప్పుడు మ‌హేశ్ కూడా రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు కాబ‌ట్టే అదే మూడ్ లో ఉన్నాడు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ కు ఓత్ అని పెట్టారు. ఇప్పుడు విజ‌న్ అంటున్నాడు. సాధార‌ణంగా రాజ‌కీయాల్లోనే విజ‌న్ అనే ప‌దం వాడ‌తారు. అందుకే టీజ‌ర్ ప్లేస్ లో విజ‌న్ ను పెట్టాడు కొర‌టాల శివ‌. ఈ చిత్రంలో ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై కాస్త సెటైర్ల‌తో పాటు కొన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు ఎలా ఉంటే బాగుంటాయి అనేది కూడా కొర‌టాల చూపిస్తున్నాడ‌ని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. ఈ పొలిటిక‌ల్ హీట్ మ‌హేశ్ బాబు ఎలా త‌ట్టుకుంటాడో..? 

More Related Stories