English   

మహేష్ భలే కాన్ఫిడెంట్ గా ఉన్నాడే..

mahesh-babu

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనేనేనుపై ఎన్నడూ లేనంత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. పైగా సినిమా రిజల్ట్ తను ఊహించినట్టుగానే వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. మరి ఇంత నమ్మకం ఎందుకో తెలుసా.. ముఖ్యమంత్రి అనగానే ప్రయోగాలు చేయకుండా కమర్షియల్ సినిమాల్లానే దీన్ని తీర్చిదిద్దడమేనట. ఒకరకంగా మహేష్ బాబు సేఫ్ గేమ్ ఆడినట్టు తెలుస్తోంది. మరోవైపు దుబాయ్ తోపాటు యూఎస్ నుంచి కూడా సినిమాపై విపరీతమైన పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ఇవన్నీ కలిసే మహేష్ బాబు కాన్ఫిడెన్స్ ను పెంచాయనుకోవచ్చు.

కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఓ సాధారణ మెకానిక్ నుంచి ఓ యువకుడు ముఖ్యమంత్రి వరకూ ఎలా వెళ్లాడు అనేదే కథాంశం. అంత వరకూ అతను వెళ్లడానికి కారణం అమ్మ నేర్పిన మంచితనమే. అంటే దీన్ని బట్టి ఇందులో మదర్ సెంటిమెంట్ కూడా బానే ఉంటుందనుకోవచ్చు. కామన్ మ్యాన్ సిఎమ్ కావడం అనేది చాలా పెద్ద కాన్ ఫ్లిక్ట్ తో కూడిన పాయింట్. ఆ కాన్ ఫ్లిక్ట్ ను కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగితే.. మాత్రం కొరటాల శివ సక్సెస్ అయినట్టే. కాకపోతే అదే మాత్రం ఇబ్బందిగా ఉన్నా మొత్తానికే ప్రమాదం తప్పదు. కానీ ఇప్పుడు వీరి కాన్ఫిడెన్స్ చూస్తోంటే సినిమా నిజంగానే బానే వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాడు మహేష్. చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నాడు. అందరూ అనుకున్నట్టు ఇందులో పొలిటికల్ సెటైర్స్ ఉండవని చెప్పాడు. ఒక్క కాంట్రవర్శీ కూడా ఉండదని చెప్పాడు. ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ లోని ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు.. వాటికి సొల్యూషన్స్ కూడా చెప్పారట. అందుకోసం దర్శకుడు కొరటాల శివ చాలా రీ సెర్చ్ చేశాడని చెబుతున్నాడు. అలాగే ఇకపై ప్రయోగాలు అస్సలే చేయనంటున్నాడు. ఎప్పట్లానే ఎప్పటికీ రీమేకులు చేయనన్నాడు. మొత్తంగా సినిమా రిజల్ట్ పై మహేష్ మాత్రం ఎప్పుడూ లేనంత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. మరి అతని నమ్మకం ఏ మేరకు నిజం అవుతుందో మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.

More Related Stories