English   

భ‌ర‌త్ మూడ్రోజుల్లో 100 కోట్లు.. బాపురే..!

Mahesh-babu
2018-04-23 10:06:04

తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. మొన్న‌టికి మొన్న రంగ‌స్థ‌లంకు 100 కోట్లు చేరుకోడానికి 4 రోజులు ప‌ట్టింది. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేనుకు అయితే మూడు రోజులే స‌రిపోయాయి. తొలిరోజే 55 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసిన భ‌ర‌త్.. రెండోరోజు కూడా అదే దూకుడు చూపించింది. రెండో రోజు కూడా అన్ని చోట్లా హౌజ్ ఫుల్స్ తో అద‌ర‌గొట్టేసాడు భ‌ర‌త్. శ్రీ‌మంతుడు త‌ర్వాత కొర‌టాల‌తో మ‌రోసారి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు మ‌హేశ్ బాబు. ఈ చిత్ర దూకుడు చూస్తుంటే ఈజీగా 200 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. ఓవ‌ర్సీస్ లో అయితే మ‌రీ అరాచ‌కంగా ఉన్నాడు భ‌ర‌త్. అక్క‌డ రెండే రోజుల్లో 2 మిలియ‌న్ అందుకుని కొత్త రికార్డుల‌కు నాందీ ప‌లుకుతున్నాడు. నాన్ బాహుబ‌లిలో ఏ రికార్డ్ కూడా అక్క‌డ మిగిలేలా క‌నిపించ‌డం లేదు. మొన్న‌టికి మొన్న రంగ‌స్థ‌లం సృష్టించిన 3.4 మిలియ‌న్ రికార్డ్ కూడా భ‌ర‌త్ తిర‌గ‌రాసేలా ఉన్నాడు. మూడు రోజులు ముగిసే స‌రికి క‌చ్చితంగా 2.5 మిలియ‌న్ దాట‌డం ఖాయ‌మైపోయింది. ఇండియాలో కూడా భ‌ర‌త్ దూకుడు ఇలాగే ఉంది. మొత్తానికి ఇంటా బ‌య‌టా భ‌ర‌త్ అనే నేను ఓ రేంజ్ లో ర‌ప్ఫాడిస్తున్నాడు. మ‌రోవైపు రెండు వారాలు సినిమాలు కూడా ఏవీ లేక‌పోయేస‌రికి భ‌రత్ దూకుడు మామూలుగా లేదు. క‌చ్చితంగా రంగ‌స్థ‌లం రికార్డుల‌న్ని భ‌ర‌త్ తుడిచిపెట్టేలా క‌నిపిస్తున్నాడు. 

More Related Stories