English   

మ‌హేశ్ మ‌హా జాదుగాడు..!!

maheshbabu-01
2018-07-03 20:42:49

జాదూగాడు అనే టైటిల్ నాగ‌శౌర్య‌కు వెళ్లిపోయింది కానీ అస‌లైన జాదూగాడు మాత్రం మ‌హేశ్ బాబే. ఈయ‌న త‌న టైమ్ ను భ‌లే బ్యాలెన్స్ చేస్తుంటాడు. అవ‌స‌రం ఉన్న‌పుడు.. లేన‌పుడు చ‌క్క‌గా మేనేజ్ చేసుకుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. వంశీ పైడిప‌ల్లి సినిమాకు మ‌రో నెల రోజుల వ‌ర‌కు బ్రేక్ లేకుండా ఉండాల్సింది. కానీ మోడి పుణ్య‌మా అని డెహ్రాడూన్ లో వీళ్ళు షూట్ చేస్తోన్న ప్లేస్ ను త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు అధికారులు. దాంతో అనుకోకుండా షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. సాధార‌ణంగా మ‌హేశ్ కు ఖాళీ టైమ్ దొరికితే మ‌రో ఆలోచ‌న లేకుండా హాలీడేకు వెళ్లిపోతాడు.

కానీ ఈ సారి మాత్రం కొత్త‌గా ఆలోచిస్తున్నాడు. టైమ్ వేస్ట్ చేయ‌డం ఎందుకు అని సింపుల్ గా యాడ్స్ పూర్తి చేస్తున్నాడు. రియ‌ల్ ఎస్టేట్ యాడ్ షూటింగ్ ను ఈ మ‌ధ్యే పూర్తి చేసాడు ఈ హీరో. దాంతోపాటు మ‌రిన్ని యాడ్స్ కూడా మ‌హేశ్ చెంత‌కు వ‌స్తున్నాయి. మ‌ళ్లీ షూటింగ్ మొద‌ల‌య్యే స‌మ‌యానికి ఈ టైమ్ ను అలా వాడుకోవాల‌ని చూస్తున్నాడు. మొత్తానికి డ‌బ్బుకు డ‌బ్బు.. షెడ్యూల్ కు షెడ్యూల్ కూడా క‌వ‌ర్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి.. మ‌హేశ్ కాదా జాదూగాడు..

More Related Stories